స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా.
ఈనెల 22 తేదీన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ మెదక్ కేథడ్రల్ చర్చ్ సందర్శన.కుల్చారం మండలం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాల లో విద్యార్థినిలతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరు.జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.గురువారం మెదక్ పట్టణంలో ఈనెల 22వ తారీఖున ఆదివారం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటన కుల్చారం మండలం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాలలో విద్యార్థినిలతో ముఖాముఖి కార్యక్రమం లో పాల్గొంటున్న నేపథ్యంలో మెదక్ కేథడ్రల్ చర్చ్ లోని ముందస్తు ఏర్పాట్ల కోసం మెదక్ ఆర్డిఓ.రమాదేవి తాసిల్దార్ లక్ష్మణ్ బాబు చర్చ్ ప్రెసిడెంట్ శాంతయ్య సెక్రెటరీ బోని తో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా రూట్ మ్యాప్ పార్కింగ్ చర్చి ఆవరణలో ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చి నిర్వాహకులు అధికారులతో చర్చించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మెదక్ పట్టణంలో మెదక్ కేథడ్రల్ చర్చ్ ఈనెల 25వ తారీకు వరకు వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉత్సవాలు నిర్వహించడంలో భాగంగా ఉన్నతాధికారులు తాకిడి మెదక్ జిల్లాలో ఉంటుందని తెలిపారు. ముందస్తుగా ఈనెల 22వ తారీఖున ఆదివారం గవర్నర్ పర్యటన చర్చి సందర్శిస్తారని అనంతరం కుల్చారం మండలం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాల లో విద్యార్థినిలతోముఖాముఖి కార్యక్రమం లో పాల్గొంటున్న నేపథ్యంలో ఏర్పాట్లలో లోటుపాట్లు కలగకుండా చర్యలు చేపట్టామన్నారు.