స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా.

పది లో 100 శాతం ఉత్తిర్ణత లక్ష్యం
పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ను మొదటి స్థానంలో నిలబెట్టాలి
10/10 సాధించేందుకు విద్యార్థులు కష్ట పడాలి
చదువులో వెనుకంజలో ఉన్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలి

పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచేందుకు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు
పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో వంద శాతం ఉత్తిర్ణత సాధించడంపై గురువారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎంఈఓ లతో కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని గత విద్య సంవత్సరానికి సంబందించి పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో బెరీజు వేసుకొని ఈ సంవత్సర ఫలితాల్లో వ్యత్యాసం కనపడాలని ఇందుకుగాను ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తయారుచేసి అమలు పరచాలని స్టూడెంట్ వైస్ డీటెయిల్స్ తీసుకుని
తయారు చేయాలన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఉత్తమ ఉద్యోగులుగా స్థిరపడిన వారి పేర్లను ఫోటోలతోపాటు పాఠశాలల్లో ఉంచినట్లయితే వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని జిజ్ఞాస పెరుగుతుందని అన్నారు. విద్యార్థి ఇంగ్లీష్ మాట్లాడడంపై మక్కువ చూపించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.డ్రాప్ అవుట్ తగ్గించాలని చైల్డ్ మ్యారేజెస్ అరికట్టాలని బాల్య వివాహాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు.ఆయా పాఠశాల విద్యార్థులు వంద శాతం ఉత్తిర్ణత సాధించటానికి ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళారో ఎంఈఓ లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ విద్య సంవత్సరంకు సంబందించి పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాలోని అన్ని రకాల విద్యాసంస్థల విద్యార్థులు వంద శాతం ఉత్తిర్ణత సాధించే విధంగా ప్రణాళిక ద్వారా ఉపాధ్యాయులు కృషి చేసే విధంగా ఎంఈఓ చర్యలు చేపట్టాలన్నారు.
వచ్చే నెల మొదటి తారీఖు నుండి పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు జరగాలన్నారు.డిసెంబర్ నెల చివరి వరకు పదవ తరగతి సిలబస్ అయిపోవాలన్నారు.గ్రౌండ్ బేస్ లెర్నింగ్ అభ్యాస దీపిక పుస్తకం లో ఉన్న ప్రశ్నల పైన అమలు పరచాలన్నారు.చదువు తో పాటు ప్రతీ విద్యార్థికి మంచి పౌష్టికహారం అందేలా ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉండాలన్నారు.నెల రోజుల పాటు ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థులను బాగా ప్రిపేర్ చేయాలన్నారు.భోధన తో పాటు విద్యార్థుల అటెండెన్స్ మీద దృష్టి పెట్టి తరగతి విద్యార్థులందరు పరీక్ష రాసే విధంగా రెగ్యులర్ గా స్కూల్ కి వచ్చేలా మానటరింగ్ చేయాలన్నారు.జిల్లా స్థాయిలో తయారుచేసిన అభ్యసన సామాగ్రిని తరగతి గదిలో అమలు చేయించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ మెదక్ ఎంఈఓ నీలకంఠం అకాడమిక్ మానిటరింగ్ అధికారి సంబంధిత ఎంఈఓ లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!