చేవెళ్ళ:
అంగన్వాడి విద్యార్థులకు దాతలు అందిస్తున్న సేవలు అభినందనీయమని అంగన్వాడి టీచర్ ఉమారాణి అన్నారు. చేవెళ్ల వాస్తవ్యులు రాహుల్ ఫుట్ వేర్ యాజమాని ముఖేష్ తన కూతురు భవాని పుట్టినరోజు సందర్భంగా గురువారం మండల కేంద్రంలోని అంగన్వాడి చిన్నారులకు వారి కుటుంబ సభ్యులతో కలిసి బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తమ కూతురు పుట్టిన రోజు సందర్భంగా సేవా కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందన్నారు. మునుముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు ముందు ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ ఉమారాణి, చిన్నారులు, తల్లులు పాల్గొన్నారు.