బుధవారం మెదక్ పట్టణంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల& జూనియర్ కాలేజ్( బాలికలు)
తెలంగాణ గురుకుల పాఠశాల& జూనియర్ కళాశాలలను మెదక్ జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా
పాఠశాలలో అందిస్తున్న వసతులు విద్యార్థుల ఆహార మెనూ వంటగది స్టోర్ రూం డైనింగ్ హాల్ లను విద్యార్థుల కోసం తయారు చేసిన భోజనంను పరిశీలించి కామన్ డైట్ మెనూని పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు.
విద్యార్థుల నుంచి భోజన నాణ్యతపై ఫీడ్‌బ్యాక్ తీసుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా మెనూ పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు.ఇటీవల ప్రభుత్వం డైట్ చార్జీ లు పెంచిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే కామన్ డైట్ అమలు చేస్తున్నదని రోజు వారి అందించే డైట్ వివరాలు ఫ్లెక్సీ ని పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యం మరియు చదువు అత్యంత ప్రాధాన్యమైనవని తెలిపారు. పాఠశాల వసతులు భోజనం నాణ్యత విషయంలో ఎలాంటి వ్యత్యాసం రావొద్దని ఆదేశించారు.
ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఏదేని లోపం వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు వ్యక్తి గత పరిశుభ్రత పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
ఈకార్యక్రమం సంబంధిత ప్రిన్సిపల్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.