స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న సి ఏం కప్ 2024 జిల్లా స్థాయి పోటీలలో రెండవ రోజు పురుషుల మరియు మహిళల విభాగంలో ఖో – ఖో పోటీలు నిర్వహించారు.
రెండవ రోజు పోటీల ముగింపు సమావేశానికి జిల్లా అడిషనల్ ఎస్.పి.మహేందర్ ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతి ప్రదానం చేశారు.జిల్లా యువజన మరియు క్రీడల అధికారి నాగరాజు మాట్లాడుతూ సి ఏం కప్ 2024 జిల్లా స్థాయి క్రీడలలో మూడవ రోజు పోటీలలో భాగంగా పురుషుల విభాగంలో 19 జట్లు మహిళల విభాగంలో 16 జట్లు పాల్గొన్నాయని తెలిపారు. పురుషుల విభాగం లో శివంపేటజట్టు మహిళల విభాగంలో నర్సాపూర్ రూరల్ జట్టు విజయం సాధించింది. ముఖ్య అతిథి గౌరవ అధిష్టానం ఎస్.పి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయి లో నైపుణ్యం ఉన్న క్రీడాకారులను వెలికితీసే ఉద్దేశ్యంతో ఈక్రీడలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుందని క్రీడలలో పాల్గొనడంద్వారా విద్యార్థుల లో జాతీయ సమైక్యత స్నేహభావం పెంపొందుతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో పీ.డి.లు శ్రీనివాసరావు మాధవరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు వివిధ మండలాల నుండి విచ్చేసిన వ్యాయామ ఉపాద్యాయులు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.