స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా
విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధనా మెలుకువలు అవసరం.ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ కళాశాల వారీగా విభజించి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి.ఇంటర్మీడియట్లో 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా పని చేయాలి.ఇంటర్మీడియట్ పాస్ పర్సంటేజ్ లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి డ్రాప్స్ తగ్గించాలి. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
మెదక్ జిల్లా ఇంటర్మీడియట్ 100% ఉత్తీర్ణత లక్ష్యంగా సంబంధిత ప్రిన్సిపల్ పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.
బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఇంటర్మీడియట్ అధికారి మాధవి ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ కళాశాలల ప్రిన్సిపల్స్ తో కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వం అన్ని వసతులుమెరుగుపరుస్తుందని దానికి అనుగుణంగా లక్ష్యాలను సాధించడంలో నిరంతరం శ్రమించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇంటర్మీడియట్ పాస్ పర్సంటేజ్ పెరగాలంటే డ్రాప్ అవుట్స్ నివారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎవరైతే విద్యార్థులు పదవ తరగతి పాసైనవారికి ఇంటర్మీడియట్లో 100% ఎన్రోల్మెంట్ జరగాలన్నారు. ప్రాధాన్యత క్రమంలో
ప్రతి యొక్క విద్యార్థి హాజరు శాతాన్ని గమనించాలన్నారు గ్రౌండ్ బేస్ లెర్నింగ్ విధానాన్ని అమలుపరిచి బోధన నైపుణ్యాలు మెరుగుపరచాలన్నారు.
నారాయణ చైతన్య కళాశాలలకు దీటుగా బోధన జరగాలన్నారు.ఇంటర్మీడియట్ చదువులతో ఏ ఒక్కరికి ఉద్యోగం అనేది సాధ్యపడదని మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీగా ఉన్నదని చెప్పారు ఇంటర్ ఫస్టియర్ సెకండియర్ కళాశాల వారీగా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు గత సంవత్సరం సెకండ్ ఇయర్ లో ఉత్తీర్ణత అయిన వారిని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం లక్ష్యాల మేరకు ఈశాతాన్ని పెంపు దిశగా కృషి చేయాలి అన్నారు.డ్రాప్స్ తగ్గించాలి బోధన నైపుణ్యాలు మెరుగుపడాలి విద్యార్థులతో మమేకమై గుణాత్మక విద్యను అందించాలని చెప్పారు.
విద్యా బోధనలో సమూల మార్పులు తీసుకోవాలని విద్యార్థులకు ఫిజిక్స్ అంటే భయాన్ని విడాలని అన్ని సబ్జెక్టుల మీద దృష్టి పెట్టి గుణాత్మక విద్య బోధించాలన్నారు. స్టూడెంట్ వారీగా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని చెప్పారు సిలబస్ ముగింపుకు దగ్గరలో ఉందని ప్రాధాన్యత పాఠ్యాంశాలను రివిజన్లో భాగంగా మరలాబోధించాలని చెప్పారు.బట్టిఇజాన్ని పక్కన
పెట్టి ఫార్ములాగురించి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చెప్పాలన్నారు
ఇంటర్మీడియట్ పూర్తి అయిన వెంటనే బాల్య వివాహాలు చేయడానికి విద్యార్థిని తల్లిదండ్రులు పూనుకుంటారని వీటిని నిర్మూలించాలంటే జిల్లా సంక్షేమశాఖ పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో చర్యలు చేపడతామన్నారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రిన్సిపల్స్ తదితరులు పాల్గొన్నారు.