స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా

ఎలాంటి సంఘటన జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకునేలా QRT లు
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

ఈరోజు జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. జిల్లాలోని నాలుగు QRT పార్టీలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి అత్యవసర పరిస్థితులలో పోలీస్ యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలను గురించి పలు సూచనలు చేసినారు.ఈ సంధర్బంగా జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత ప్రధాన లక్ష్యo అని జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్ అన్నారు.జిల్లా పరిధిలోని సామాన్యుడిని దృష్టిలో పెట్టికోని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ వుంటుందని శాంతి భద్రతల విషయంలోను కఠినంగా వుంటామని ఎవరైన శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని కఠిన చర్యలు తప్పవని విద్వేషాలను రెచ్చగోట్టేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాము అన్నారు. జిల్లాలో నేరాల నియంత్రణ అదుపునకు మరియు నేరాల గుర్తింపు శాంతి భద్రతల (LAW & ORDER) సంరక్షణకు ప్రతి ఒక్కరి సహకారం అవసరం అని ఇందుకు అనుగుణంగా జిల్లాలో 4 QRT లు కేటాయించడం జరిగిందని జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.ఒక ప్రకటనలో తెలియజేసారు. ఇందులో బాగంగా (QRT) బలగాలను విస్తృతంగా వినియోగించి లా&ఆర్డర్ నిర్వహించడంలో ఏదైనా నిరసనలకు వెంటనే స్పందించడంలో మరియు ఈ కీలక సమయంలో పౌరుల భద్రతను నిర్ధారించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని తెలిపారు. జిల్లాలో ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలు సంభవిస్తే వెంటనే స్పందించేందుకు QRT బలగ బృందాలు వ్యూహాత్మకంగా నివారించడానికి కేటాయించబడ్డాయి.
ప్రజలకు విజ్ఞప్తి.
ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిర్వహిస్తుంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు లేదా డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712657888 కు తెలుపగలరు. ప్రజలందరూ కలసికట్టుగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం సహకరించాలని కోరినారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!