విద్యార్థులకు నాణ్యమైన బోజనం అందించాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు.
స్టూడియో 10 టివి, ప్రతినిధి ,సిల్వర్ రాజేష్ , మెదక్ జిల్లా :
బుధవారం మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలోని విద్యార్థుల కోసం తయారు చేసిన భోజనం వంటగది స్టోర్ రూమ్ డార్మెటరీ రూములు తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో ముకాముఖి అయ్యారు.విద్యార్థులు చదువులో బాగా రాణించాలని మంచి మార్కులు సాధించి ఉన్నతస్థాయికి వెళ్ళాలని సూచించారు.విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని పరిశుభ్రత పాటించాలనీ విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని వార్డెన్ ను ఆదేశించారు.ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం తనిఖీ రిజిస్టర్ లో సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ఇన్చార్జి ప్రిన్సిపల్ పద్మావతి సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.