ఇద్దరు కొట్లాడితే ఒక్కరే గెలుస్తారు రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారు.
14న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి.
స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా :
లోక్ అదాలత్ ద్వారా ఇరువర్గాల కక్షీదారులు అంగీకారయోగ్యమైన సత్వర పరిష్కారం పొందవచ్చు…
రాజీమార్గమే రాజామార్గం … జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. మాట్లాడుతూ… తేదీ 14-12-2024 నాడు జరుగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ లో రాజీపడే కేసులలో రాజీపడేటట్లు కక్షిదారులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని ఇద్దరు కొట్లాడితే ఒక్కరే గెలుస్తారు రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారు రాజీమార్గమే రాజమార్గమని కక్షలు కార్పణ్యాలతో ఏమీ సాధించలేమని రాజీపడితే ఇద్దరూ గెలిచినట్లేనని లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాల కక్షీదారులు అంగీకారంతో సత్వర పరిష్కారం పొందవచ్చు అని అన్నారు. ఈ నెల 14వ తేదీన జరుగనున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.తెలిపారు. రాజీపడదగిన కేసులలో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు సివిల్ తగాదా కేసులు ఆస్తి విభజన కేసులు కుటుంబపరమైన నిర్వాహణ కేసులు వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు బ్యాంకు రికవరీ టెలిఫోన్ రికవరీ కేసులు విద్యుత్ చౌర్యం చెక్ బౌన్స్ కేసులో వాహన ప్రమాద పరిహార కేసులు చిట్ ఫండ్ కేసులు ఇతర రాజీ పడ్డ దగిన కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలని సూచించారు. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని డబ్బులను వృథా చేసుకోవద్దని సూచించారు. న్యాయస్థానం ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పోలీస్ అధికారులు కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్లు పోలీస్ సిబ్బంది రాజీపడ దగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ పడేటట్లు అవగాహన కల్పించాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. తెలిపారు.