స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా 62 వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం. పోలీసు శాఖలో హోంగార్డుల సేవలు కీలకమని జిల్లా ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్ కొనియాడారు. 62వ.హోంగార్డు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఒక భాగమై పోలీసులతో సమానంగా నిరంతరం విధులు నిర్వర్తిస్తూ హోంగార్డు ఆఫీసర్స్ అందిస్తున్న సేవలు అమోఘమని అన్నారు. వున్నప్పటికి అంకిత భసాధారణ విధులు మొదలు క్లిష్టతర విధుల వరకు అన్నింటా చక్కగా పనిచేస్తూ హోంగార్డు వ్యవస్థ పోలీస్ శాఖలో కీలకంగా మారిందని అన్నారు.శాంతిభద్రతలు ప్రజలకు రక్షణ కల్పించడంతో బాధ్యతయుతమైన సేవలు అందించడంతో పాటు మహారాష్ట్ర ఎన్నికల బందోబస్తులో అప్పగించిన భాధ్యతలు నిబద్ధతతో నిర్వహించారని అన్నారు. నిత్యం క్రమ శిక్షణతో మెలుగుతూ పోలీసుల ప్రతిష్టను మరింత పెంచేలా విధులు నిర్వర్తించాలని సూచించారు.హోంగార్డుల సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏ సమస్య ఉన్నా నేరుగా కలవ వచ్చని తమ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే నెరవేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మీన్ ఎస్.మహేందర్ సాయుధ దళ డిఎస్పీ రంగనాయక్ ఆర్.ఐ.శైలెందర్ ఆర్.ఎస్.ఐ లు నరేష్ కుమార్ భవాని కుమార్ మహిపాల్ జిల్లా హోమ్ గార్డ్ లు పాల్గొన్నారు.