అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు .. ముడిమ్యాల సహకార సంఘం చైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి
అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు అని ముడిమ్యాల సహకార సంఘం చైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మండల పరిధిలోని ముడిమ్యాల గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అంబేద్కర్ దేశ భవిష్యత్తు పునాదుల కోసం ఆయన ఎంతో చెమటోడ్చి భారతదేశానికి ఒక దిక్సూచిని అందించిన మహానుభావుడు అని కొనియాడారు.ఆయన కల్పించిన హక్కుల ద్వారానే ఈ దేశంలో అందరికీ సమన్యాయం పొందేందుకు వీలు పడిందని గుర్తుచేశారు. ప్రపంచ మేధావి అంబేద్కర్ అడుగుజాడల్లో నేటితరం యువత నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పడాల ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు పడాల రాములు. మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ వాజిద్. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కోశాధికారి వినోద్, యు.వెంకటేష్, ఖాజమోనొద్దీన్, వై రామచంద్రయ్య, ఎండీ హనీఫ్, ఎండీ ఫహీం, బుర్ల మాణిక్యం, యు రవీందర్ బీరప్ప, చాకలి వెంకటేష్, ఎర్రవల్లి ప్రభాకర్, దుర్గేశ్ ఎండీ ఛాన్పాషా, వై సుధాకర్, చిన్న ఖాజమీయ, గ్రామస్తులు పాల్గొన్నారు.