స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యాంటీ నార్కోటిక్ అనే అంశంపై అవగాహన కార్యక్రమాలు మారణాయుధాలు ప్రదర్శన ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రాంగణంలో అన్ని శాఖల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ఘనంగా నిర్వహించాలి. మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరం చేయాలి.
అడిషనల్ ఎస్పీ మహేందర్ తో కలిసి అగ్నిమాపక క్రీడల నిర్వహణ వైద్య విద్య డిడబ్ల్యుఓ వివిధ సంక్షేమ శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ నగేష్ సమీక్ష.
ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు 7,8 తేదీలలో బాలుర జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాట్లలో భాగంగా వివిధ శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ నగేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు సంబంధిత శాఖల అధికారులు భాగస్వామ్యమై వారికి అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి ఇతర జిల్లాలకు ఆదర్శంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు పండుగ వాతావరణం మన జిల్లాలో నిర్వహించాలన్నారు. 7,8 తేదీలలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించడంలో భాగంగా ఏడో తారీఖు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మరణాయుధాల ప్రదర్శన మత్తు పదార్థాల నియంత్రణ నిర్మూలన పై అవగాహన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నాలుగు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు మొత్తం పది రకాల స్టాల్స్ ఉంటాయన్నారు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ సెల్ఫీ పాయింట్ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా అవగాహన కార్యక్రమాలు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఫుడ్ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు ఎనిమిదో తేదీ అన్ని రకాల కుల సంఘాల కళాకారులు హాజరు కావడం సాంస్కృతిక ప్రదర్శనలు ఎటువంటి లోటుపాట్లు జరగకుండా మున్సిపల్ కమిషనర్ ఏర్పాట్లలో నిమగ్నమవ్వాలని అడిషనల్ కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి క్రీడల నిర్వహణ అధికారి నాగరాజు డిడబ్ల్యుఓ స్వరూప ఎస్సీ అభివృద్ధి సంక్షేమ అధికారిసంబంధిత వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.