స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా :
బతుకమ్మ పండుగ మన సంస్కృతికి ప్రతీక రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖా మాత్యులు కొండ సురేఖ,
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మాత్యులు సీతక్క.
ప్రపంచంలో పువ్వులను పూజించే సంస్కృతి ఒక్క తెలంగాణకు మాత్రమే మంత్రులు మహిళలు యువతులుతో పూల తో పేర్చిన బతుకమ్మలతో వచ్చి ఆనందంగా బతుకమ్మ ఆడారు. మంగ్లీ బతుకమ్మ ఆటపాటలు అలరించాయి. రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండ సురేఖ నోట బతుకమ్మ పాట. మెదక్ జిల్లాలో బతుకమ్మ, ఉత్సవాలు పండుగ వాతావరణంలో నిర్వహించడానికి
స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు తీసుకున్న చొరవ అభినందనీయం రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండ సురేఖ,పంచాయితీ రాజ్ శాఖ రూరల్ డెవలప్మెంట్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో సోమవారం మెదక్ జిల్లా ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి . ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు స్థానిక శాసనసభ్యులు మైనపల్లి రోహిత్ రావుపాల్గొన్నారు.