సిఐటియు మొయినాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో అప్ప జంక్షన్ నుండి మన్నెగూడ వరకు రోడ్డు విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ మాట్లాడుతూ అప్పా జంక్షన్ నుండి మన్నెగూడ వరకు రోడ్డు విస్తరణ పనులు వెంటనే ప్రారంభించాలని టెండర్ల ప్రక్రియ పూర్తయిన పనులను ఎందుకు ప్రారంభం కావడం లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు రోడ్డు విస్తరణ జరగకపోవడం వలన అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అనేకమంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ప్రస్తుతం ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి రోడ్డు విస్తరణ పనులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని వెంటనే పనులు ప్రారంభం కోసం కృషి చేయాలని అన్నారు లేనిపక్షంలో ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేసిన వారు అవుతారని అన్నారు అప్పా జంక్షన్ నుండి మన్నెగూడ వరకు రోడ్డు విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని లేనిపక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమం లో సీఐటీయూ మొయినాబాద్ మండల నాయకులు మహేందర్, చెన్నయ్య,రవీందర్, హైమద్, బాలు, రవి, శ్రీను, నర్సింహా, కృష్ణ తదితరులు పాల్గొన్నారు