స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా: నేటి వరకు మెడికల్ కొరతతో నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఇక నుండి మెదక్ లోనే మెడికల్ స్టోర్. మెదక్ జిల్లాకు మెడికల్ స్టోర్ ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది అని మెదక్ నియోజకవర్గ ప్రజలకు వైద్యం సేవలో ఎలాంటి ఇబ్బంది కల్గ కుండా ఉండేందుకు నియోజకవర్గ ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ చొరవతో జిల్లాకు మెడికల్ సెంట్రల్ స్టోర్ మంజూరు అయ్యింది. అంతే కాకుండా డాక్టర్ గా ఎమ్మెల్యే ఉన్నందున ప్రజలకు వైద్య సేవలు ఏ విధంగా తోడ్పాటు అవుతాయని గ్రహిoచి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మెదక్ జిల్లాకు మెడికల్ స్టోర్ ను తీసుకు రావడంకు కృషి చేశారన్నారు. ఇకనుండి ఎలాంటి మందులు అయినా మెదక్ లోనే లభిస్తాయని పేర్కొన్నారు.