ములుగు జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు ములుగు నియోజకవర్గ కో – ఆర్డినేటర్ గొల్లపల్లి రాజేందర్ గౌడ్ గారు…
గత పదేండ్ల నుండి ఏ ఒక్క రైతుకు కూడా రైతు రుణమాఫీ చేయని బి.ఆర్.ఎస్. మరియు బీజేపీ పార్టీలు నేడు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం సిగ్గుచేటు…
లక్ష రూపాయల రుణమాఫీ కోసం ముక్కి మూలిగిన బి.ఆర్.ఎస్. ప్రభుత్వం నేడు ఎనిమిది నెలల్లో రెండు లక్షల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదం…
పారిశ్రామిక వేత్తలకు 14 లక్షల కోట్లను మాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వం దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మాత్రం రుణమాఫీ ఎందుకు చేయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు…
పీఎం కిసాన్ ద్వారా 2000 రూపాయలు ఇస్తున్నాం అని చెప్పే బీజేపీ నాయకులు ఎంతమందికి పీఎం కిసాన్ పథకం అందుతుందో చెప్పాలి…
ఆదాని, అంబానీ లాంటి వాళ్లకు మాత్రం లక్షల కోట్ల రుణాలు మాఫీ చేయొచ్చా…
రైతులకు మాత్రం పంట రుణమాఫీ చేయరా…
గత పదిహేను యేండ్ల క్రితమే మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు దేశం అంతటా రైతులకు రైతు రుణమాఫీ చేశామని తెలియజేశారు…
ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ జరుగుతుంది…
కేంద్రంలో అధికారంలో ఉండి 2000 రూపాయలు కాక మీరు ఏం చేస్తున్నారో చెప్పండి…
అటవీ హక్కుల చట్టం తెచ్చి పోడు రైతులకు పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ…
రైతులకు అండగా నిలబడింది కాంగ్రెస్ పార్టీ…
గత పదిహేనేళ్ల క్రితమే సబ్సిడీలో రైతులకు తైవాన్ పంపులు, విత్తనాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ…
బీజేపీ పార్టీ నేడు ఇచ్చే రెండు వేల రూపాయలకే మోడీ గారు ఏదో చేశారని చెప్పడం నిజంగా విడ్డూరం…
కాంగ్రెస్ పార్టీ రైతులకు పంటకు రుణాలు ఇచ్చింది, పంటకు సాగునీరు కొరకు ఇందిరా జల ప్రభ బోర్లు వేసింది, అకాల వర్షాల వల్ల నష్టపోతే నష్ట పరిహారం ఇచ్చింది…
భూ నిర్వాసితులకు కూడా నష్ట పరిహారం అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే…
పదేండ్ల అధికారంలో బి.ఆర్.ఎస్.పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ వర్షాల వల్ల నష్టపోయిన రైతుకు నష్టపరిహారం కూడా అందించనీ పార్టీలు నేడు రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదం…
తేది: 07.10.2024 సోమవారం అనగా ఈరోజున ములుగు జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క గారి ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారి సూచనల మేరకు, మండల అధ్యక్షులు ఎండి. చాంద్ పాషా గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్ కాంగ్రెస్ నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు ములుగు నియోజకవర్గ కో ఆర్డినేటర్ గొల్లపల్లి రాజేందర్ గౌడ్ గారు విచ్చేసి బీజేపీ మరియు బి.ఆర్.ఎస్. పార్టీలు గత పది సంవత్సరాల నుండి అధికారంలో ఉండి రుణమాఫీ చేయలేకపోయాయి అని కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎనిమిది నెల్లలోనే రెండు లక్షల రుణమాఫీ చేసి చూపించింది అని, కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హతే బి.ఆర్.ఎస్. మరియు బీజేపీకి లేవని అన్నారు.
ఈ సందర్భముగా రాజేందర్ గౌడ్ గారు మాట్లాడుతూ పదేండ్ల పాలనలో రైతులకు బి.ఆర్.ఎస్. మరియు బీజేపీ పార్టీలు పంట రుణమాఫీ ఎందుకు చేయలేదు, లక్ష రూపాయల రుణమాఫీ కోసం పదేండ్లు ముక్కీ, మూలిగిన బి.ఆర్.ఎస్. పార్టీ ఎనిమిది నెలల్లోనే రెండు లక్షల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. నిజంగా బీజేపీ మరియు బి.ఆర్.ఎస్.పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శించరు అని, కేంద్రంలో వరుసగా మూడో సారి అధికారంలోకి వచ్చిన బి.ఆర్.ఎస్. పార్టీ ఇంతవరకు రైతులకు ఎందుకు పంట రుణమాఫీ చేయట్లేదో బీజేపీ నాయకులు చెప్పాలని అన్నారు. నాలుగు నెలలకు ఒకసారి పీఎం కిసాన్ పథకం ద్వారా 2000 రూపాయలు ఇచ్చి దాన్ని పెద్ద గొప్పగా చెప్పుకుంటున్న బీజేపీ నాయకులు గత పదిహేను యేండ్ల క్రితమే మన్మోహన్ గారి హయాంలోనే దేశంలోని రైతులకు అందరికీ ఏక కాలంలో లక్ష రూపాయల పంట రుణమాఫీ చేసిన ఘనత ఉందని గుర్తుంచుకోవాలని అన్నారు. కార్పొరేట్ రంగాన్ని పెంచి పోషిస్తూ అంబానీ, అదానీ లాంటి వారికి దేశాన్ని దోచిపెడుతూ 14 లక్షల కోట్ల ప్రభుత్వ బకాయిలను మాఫీ చేసి మరొక సారి అంబానీ, అదాని లాంటి వారికి అండగా నిలిచిన బీజేపీ ప్రభుత్వం రైతులకు ఎందుకు పంట రుణమాఫీ చేయలేదని ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మొండి చేయి చూపిన వైనం బీజేపీ పార్టీది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ రైతులకు ఆనాడు వై.ఎస్.ఆర్. గారు ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసిన, నేడు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చెల్లిందని అన్నారు. బీజేపీ పార్టీ కావాలని నల్ల చట్టాలు తెచ్చి రెండు నెలలు డిల్లీలో రైతులను ఎంత క్షోభ పెట్టిందో ప్రతి ఒక్కరికీ తెలుసని, వీలు అయితే రైతులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా సహాయం చేయండి అంతే కానీ సహాయం చేసే కాంగ్రెస్ పార్టీని అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని అన్నారు.
బి.ఆర్.ఎస్. పార్టీ గత పదేండ్లు అధికారంలో ఉండి అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు కూడా కనీస నష్ట పరిహారం కూడా చెల్లించని వారు నేడు రైతుల గురించి రాస్తారోకోలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ధరణి పేరుతో అక్రమంగా భూముల్ని లాక్కుని, భూ నిర్వాసితులకు కనీస నష్ట పరిహారం కూడా ఇవ్వని బి.ఆర్.ఎస్. పార్టీ అధికారం కొల్పోగానే రైతుల కోసం పోరాడుతున్నట్లు ముసలి కన్నీరు కార్చడం సరికాదని అన్నారు. ఇప్పటికీ అయిన కాంగ్రెస్ పార్టీ మీద కావాలని విమర్శలు చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజల కష్టాల్లో నిలబడాలని సూచించారు. కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు మరియు కవిత గార్లు అక్రమ ఆస్తులు ఎలా కూడబెట్టాలో ఆలోచించారు తప్ప ఏనాడూ రైతుల గురించి ఆలోచించిన పాపాన పోలేదని అన్నారు. రైతులకు అందరికీ తెలుసు బి.ఆర్.ఎస్. హయాంలో పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితి ఉండేదని, తరుగు పేరుతో పేద రైతు నడ్డి విరిచిన పార్టీ బి.ఆర్.ఎస్. పార్టీ అని అన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ, తరుగు లేకుండా ప్రతి రైతు శ్రమను గౌరవించిందని అన్నారు. పోడు భూముల రైతుల పేర్లను పోడు భూముల హక్కు పత్రాలను తొలగించి అటవీ అధికారులతో పోడు రైతుల మీద అక్రమ కేసులు బనాయించిన బి.ఆర్.ఎస్. పార్టీకి ఎదురొడ్డి నిలిచింది అప్పటి ములుగు ఎమ్మెల్యే, ఇప్పటి మంత్రి సీతక్క గారని గుర్తుంచుకోండి అని అన్నారు. సీతక్క గారి పోరాట ఫలమే పోడు భూములకు పట్టాలు ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా కెసిఆర్ గారు చెప్పి మాట నిలుపుకోలేదని అన్నారు. ఇప్పటికీ అయిన దొంగ ధర్నాలు కాకుండా నిజంగా రైతులకు అండగా నిలబడండి అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి, మత్స్యశాఖ జిల్లా అధ్యక్షులు కంబాల రవి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నూనేటి శ్యామ్, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వాకిటి రామకృష్ణా రెడ్డి, ములుగు జిల్లా ఉపాధ్యక్షులు పల్లె జైపాల్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల్ల భరత్, వెంకటాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బండి శ్రీనివాస్, ములుగు పట్టణ అధ్యక్షులు చింతనిప్పుల బిక్షపతి, ఎస్.సి.సెల్ మండల అధ్యక్షులు మట్టేవాడ తిరుపతి, సీనియర్ నాయకులు బాదం ప్రవీణ్, రాంరెడ్డి, షరుపొద్దీన్, షకీల్, గుంటోజు శంకర్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి చక్రపు రాజు, మండల యువజన సంఘం అధ్యక్షులు కుక్కల నాగరాజు, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పులుగుజ్జు వెంకన్న, గోవిందరావుపేట బీసీ సెల్ మండల అధ్యక్షులు కాడబోయిన రవి, అబ్బాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు గుండ బిక్షపతి, బండారుపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు నెల్లుట్ల రాజన్న, మాజీ సర్పంచ్ జంజిరాల దేవయ్య, అశోక్ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.