స్టూడియో 10టివి మెదక్ జిల్లా ప్రతినిధి : మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి కౌన్సిలర్ స్థానిక నాయకులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి కేటీఆర్ పై చేసిన ఆరోపణలు బేషరతుగా వెనక్కి తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. దుబ్బాక లో మైనం పల్లి హనుమంత్ రావు మాజీ మంత్రులు కేటీర్, హరీష్ రావు పై పెట్రోల్ పోసి తగలబెడతాంఅనే వ్యాఖ్యలను పార్టీ తరఫున ఖండిస్తున్నామన్నారు.
చిల్లర రాజకీయాలు కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మంత్రి కొండా సురేఖ అనవసరంగా రాజకీయ పలుకుబడి కోసం బురద చల్లే ప్రయత్నం మానుకోవాలి అన్నారు. నిండు అసెంబ్లీ లో మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి మీద సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే ఎవరు స్పందించలేదని గుర్తుచేశారు. కేటీఆర్ ను అనవసరంగా ఈ విషయంలోకి లాగారని ఇది సరైన పద్ధతి కాదు అన్నారు. మల్లన సాగర్ ముంపు గ్రామాల ప్రజలను ఒప్పించి నిర్మాణం చేపట్టారని దానివలన రెండు పంటలు పండుతున్నాయన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి హైడ్ర బాధితులను క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలిలిస్తే వారి బాధలేంటో తెలుస్తాయన్నారు. మూసి ప్రక్షాళన వలన ఎవరికి లాభం జరుగుతుందో ఆలోచించాలి అన్నారు. సిద్దిపేట అభివృద్ధిలో మెదక్ నియోజకవర్గం పోటీ పడాలి ప్రతిపక్షంగా సహకరిస్తామని తెలిపారు. మెదక్ ఎమ్మెల్యే మెదక్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకురావాలని మెదక్ పట్టణంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని చెప్పారు. మెదక్ నియోజకవర్గం లో రుణమాఫీ జరగని రైతుల సమస్యలు పట్టించుకోకుండా పోలీసులు అడ్డుపెట్టుకొని సమస్యల మీద ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
మెదక్ ఎమ్మెల్యే గా మైనంపల్లి రోహిత్ గెలిచి 9 నెలలు అవుతున్న ఒక్క పైసా తెలేదు అన్నారు. మైనం పల్లి హనుమంత్ రావు ది కాంగ్రెస్ పార్టీలో హోదా ఎందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ హోదాతో మైనంపల్లి హనుమంతరావుకు ప్రోటోకాల్ ఇస్తున్నారని ప్రశ్నించారు. మెదక్ నియోజకవర్గనికి గతంలో ఇద్దరు ఎమ్మెల్యేలు అని ప్రశ్నించినవారే ఇప్పుడు మెదక్ నియోజకవర్గానికి నలుగురు ఎమ్మెల్యేలు అయ్యారని పేర్కోన్నారు. మెదక్ నియోజకవర్గం సర్వ నాశనం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో మెదక్ 20 సంవత్సరాలు వెనకకు వెళ్ళింది అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.