స్టూడియో 10టివి ప్రతినిధి మెదక్ జిల్లా : అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించే విధంగా ప్రభుత్వం జారీ చేయనున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం జరుగుతున్న సర్వే పూర్తి స్థాయిలో నిర్వహిస్తు న్నట్లు నోడల్ అధికారి ఆర్డీవో రమాదేవి తెలిపారు.గురువారం మెదక్ మున్సిపల్ పరిధిలో ఎంపిక చేసిన కుటుంబాలలో ఈరోజు నుండి 7 వ తేదీ వరకు జరిగే డిజిటల్ కార్డు జారీ ప్రక్రియ కి సంబందించిన సర్వే ను గురువారం మున్సిపాలిటీ పరిధిలో ఆర్డిఓ రమాదేవి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆర్డీవో రమాదేవి సర్వే చేస్తున్న అధికారులతో మాట్లాడుతూ కుటుంబంలో ఉన్న వ్యక్తుల పేరు జెండర్ పుట్టిన తేదీ వయసు కుటుంబ పెద్దతో ఉన్న సంబంధం ఆధార్ నంబర్ అడ్రస్ తదితర వివరాలన్నీ పక్కాగా ఏ ఒక్కటి మిస్ కాకుండా నమోదు చేయాలన్నారు. ప్రతిరోజు కనీసం 50 కుటుంబాలలో సర్వే అయ్యేలా చూడాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకి నిర్ణీత గడువులోగా సర్వేపూర్తి కావాలన్నారు. ఈ సందర్బంగా సర్వేచేస్తున్న బృందాల వారికి తగు సూచనలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.