సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా.
తేది -02-10-2024.
సర్వే నిర్వహణలో భాగంగా తాసిల్దార్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్ మున్సిపాలిటీ వార్డ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి కుటుంబానికి డిజిటల్ ఫ్యామిలీ కార్డ్ సర్వే పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టుటలో భాగంగా జిల్లాలోని సంబంధిత ఆర్డీవోలు, తాసిల్దార్లు రెవిన్యూ ఇన్స్పెక్టర్లు మున్సిపాలిటీ వార్డు అధికారులకు డిజిటల్ ఫ్యామిలీ కార్డుసర్వే నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు
ఈ అవగాహన సదస్సుకు అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ అక్టోబర్ 3 వ తేదీ ఉదయం నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఎలాంటి లోపాలు లేకుండా డిజిటల్ ఫ్యామిలీ కార్డు సర్వే క్షేత్రస్థాయి (డోర్ టు డోర్) పరిశీలన పూర్తి చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే రేపు ఉదయం 10 గంటల నుండి సర్వే ప్రక్రియ మొదలు కావాలన్నారు.ముందుగా గ్రామాలలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే నిర్వహించడం జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు. తద్వారా గ్రామంలో ఉన్న ప్రజలందరూ వారి వారి కుటుంబ సభ్యులకు తెలియపరచుకుని ఆధారాలతో సిద్ధంగా ఉంటారని సర్వే నిర్వహణ సులభతరంఅవుతుందన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే నిర్వహణ పరిశీలన మెదక్ జిల్లా ప్రత్యేక అధికారిగా దాసరి హరిచందన (ఐఏఎస్) వారిని ప్రభుత్వ నియమించిందని తెలిపారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల్లో ఏ ఏ అంశాలను పొందుపరచాలన్న వివరాలను నివేదిక రూపంలో అందజేయడం జరుగుతుందని తెలిపారు. అక్టోబరు మూడో తేదీ నుంచి ఏడో తేదీ వరకు అయిదు రోజుల పాటు నిర్వహించే ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేలో కుటుంబ సభ్యుల వివరాల నమోదు మార్పులు చేర్పుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనిఎటువంటి పొరపాట్లకు తావివ్వవద్దని చెప్పారు. ప్రతి కుటుంబానికి డిజిటల్ ఫ్యామిలీ కార్డు సర్వే నిర్వాహణలో ఇలాంటి సమస్యలు తలెత్తిన తమకు తెలియజేయాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో రమాదేవి, నరసాపూర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, ఈ డిస్టిక్ మేనేజర్ సందీప్ సంబంధిత మెదక్ జిల్లా మండల తాసిల్దారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మున్సిపల్ వార్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు