సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా. మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.
ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రంలో ఓ సామాన్య మానవునిగా పుట్టిన మహాత్మ గాంధీజీ తెల్లదొరలను శాంతి అహింస అనే ఆయుధాలతో తరిమి కొట్టేందుకు ఎన్నో పోరాటాలు చేశారని ఈ సమయంలో యావత్ భారతావని అంతా అతని శాంతియుత పోరాటానికి మద్దతు పలికిందని కోట్లాది మంది జనాలు ఆయన వెంట నడిచారని ఈ సందర్భంలోనే ఆయన విశ్వం మొత్తానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు.అలాంటి మహోన్నత వ్యక్తికి స్వాతంత్య్రం రాకముందు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి.అయినా వాటన్నింటనీ అధిగమించి మహాత్ముడు ఓ వ్యక్తి నుండి మహాశక్తిలా మారాడు. బ్రిటీష్ వారు మన దేశం నుండి వెళ్లిపోయేందుకు సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, స్వదేశీ వంటి ఉద్యమాలు ఎన్నో చేశారు. భారత దేశం గర్వించదగిన మహనీయులలో మహాత్మా గాంధీ ఒకరు. భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్య్రం అందించడం కోసం చేసిన పోరాటానికి గాంధీజీ ఎంచుకున్న శాంతి అహింస మార్గం భారతీయులకే కాదు యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిందిని అన్నారుమహాత్మాగాంధీ గారికి నివాళులు అర్పించిన వారిలో ఆర్.ఐ.శైలేందర్,ఎఆర్ ఎస్.ఐమహిపాల్తో పాటు జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.