సైతారా పేట గ్రామంలో “మానసిక ఆరోగ్య అవగాహన మాసోత్సవాలు” ప్రారంభం.
అనకాపల్లి జిల్లా యస్ రాయవరం మండలం సర్వసిద్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి సైతార పేట గ్రామంలో ఎం.పి.పి.స్కూల్ విద్యార్థులు కు “మానసిక ఆరోగ్య అవగాహన మాసోత్సవాలు” ప్రారంభం ను పురస్కరించుకొని అవగాహన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎం ఎస్ వి కె.బాలాజీ ఆదేశాలు మేరకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ ఎస్ వి శక్తి ప్రియ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు శారీరకంగా దృఢంగా, ఆరోగ్యంగా వున్న సరే మానసికంగా కూడా ఆరోగ్యం గా వుండాలని అప్పుడు మాత్రమే పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా వుంటారని అవగాహన కల్పించారు. అలాగే ఆరోగ్య విస్తరణ అధికారి టి నాగేశ్వరరావు పర్యవేక్షణలో అన్ని గ్రామాల్లో మానసిక ఆరోగ్యం పై అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.వీరితో పాటు పి.హెచ్.ఎన్..ఎం.రత్న సఖి, హెల్త్ సూపర్వైజర్ ఎస్ ఎస్ వి ప్రకాష్, హెల్త్ విజిటర్ వై.సూర్య కుమారి,సైతారపేట లో ఎం.పి.పి.స్కూల్ విద్యార్థులు ను ఉద్ధేశించి “మానసిక ఆరోగ్య అవగాహన మాసోత్సవాలు” మరియు “అంతర్జాతీయ శాఖాహార దినోత్సవం” పురస్కరించుకొని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్లినిక్ క్లస్టర్ పర్యవేక్షకులు డాక్టర్ పి.ఎన్.వి.ఎస్.ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మానసికంగా ఆరోగ్యం గా వుండాలంటే ఎటువంటి ఒత్తిడిలు కు లోను కాకుండా చదువు పై ఏకాగ్రత తో ఎక్కువ మార్కులు సాధించటానికి ఉపాధ్యాయుల సహకారం ప్రణాళిక రూపొందించుకొని ఆ ప్రకారం చదువుకుంటే మానసిక ఒత్తిడి లేకుండా ఆరోగ్యం గా ఉండవచ్చునని, అలాగే శారీరిక ఆరోగ్యం కొరకు ఆటలులో కూడా ఉపాధ్యాయుల సహకారం తో ప్రతిభ కనబరిచాలని అప్పుడే నిజమైన సంపూర్ణ ఆరోగ్యం గా వుంటారని అవగాహన కల్పించారు. అలాగే అంతర్జాతీయ శాఖాహార దినోత్సవం పురస్కరించుకొని డాక్టర్ పి.ఎన్.వి.ఎస్.ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పోషకాహారం తీసుకోవాలని ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు,పండ్లు వంటి శాఖాహారాలు తీసుకోవటం వలన ఆరోగ్యం గా వుంటారని అలాగే మాంసాహారులు కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువగా పండ్లు, కూరగాయలు,ఆకుకూరలు ను కూడా తమ ఆహారం లో చేర్చుకోవడం వలన అనారోగ్యం బారిన పడకుండా వుంటారని డాక్టర్ పి.ఎన్.వి.ఎస్.ప్రసాద్ అవగాహన కల్పించారు .వీరితో పాటు ఏ .ఎన్.ఎం… ఓ.వేణు, హెల్త్ సెక్రటరీ ఆశా రత్నం, ఎం .రాజేశ్వరి ,ఫార్మా సిస్టు రీటా రత్నం,స్టాఫ్ నర్సు అరుణ, వెంకట్ ,ఆఫీసు అసిస్టెంట్ షేక్ భాషా,ఉపాధ్యాయులు,ఆశా కార్యకర్తలు,ఇతర ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.