సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా
ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. మాట్లాడుతూ.. దసరా పండుగ సందర్భంగా పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది తమ సొంత గ్రామాలకు కానీ ఇతర గ్రామాలకు గాని పట్టణాలకు గాని ప్రయాణాలు చేస్తూంటారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. ప్రజలకు సూచించారు. దసరా పండుగ దృష్యా చోరీల నియంత్రణకు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ సంధర్భంగా జిల్లా ఎస్‌పి గారు ప్రజలకు పలు సూచనలు చేశారు.
👉 ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం. లేదాఎక్కువ రోజులు ఊళ్లకు వెళ్లేవారు విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలి.
👉 ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించాలని చెప్పాలి.
👉 విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో, కారులలో పెట్టడం చేయరాదు.
👉 ద్విచక్రవాహనాలు, కారులను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలుపరాదు.
👉 బీరువా తాళాలను ఇంట్లో ఉంచరాదు, తమతోపాటే తీసుకెళ్లాలి.
👉 గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి.
👉 విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు.
👉 ఆరుబయట వాహనాలకు హ్యాండిల్ లాక్ తో పాటు వీల్ లాక్ వేయాలి.
👉 ఇంటి తలుపులకు సెంట్రల్ లాకింగ్ సిస్టంను ఏర్పాటు చేసుకొని, వాచ్ మెన్ లేదా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిది.
👉 సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా సిసి కెమెరాలను ఇంటర్నెట్ అనుసంధానం ఉన్న మీ
👉 మొబైల్ నుంచే మీ ఇంటిని ఎక్కడి నుంచి అయినా ప్రత్యక్షంగా చూసుకునే వీలుంటుంది.
👉 ప్రజలు ఇండ్లలోనుండి బయలు దేరెముందు గ్యాస్ లివర్ తప్పని సరిగా ఆఫ్ చేయడం, షార్ట్ సర్కుట్ కాకుండా జాగ్రతలు పాటించాలి.
👉 ప్రజలు తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు సహకరించాలి. తమ ప్రాంతం పరిధి లోని పోలీస్ స్టేషన్ అధికారి ఫోన్ నెంబర్ ఇతర అధికారుల నెంబర్ లు ప్రజలు తమ సెల్ ఫోన్ లలో ఉంచుకోవాలి.
👉 అనుమానాస్పదంగా తమ వీధుల్లో తిరిగే కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్ కు గాని సంబందిత పోలీస్ అధికారులకు గాని సమాచారం ఇవ్వాలి.
అలాగే వాహన ప్రయాణాలు చేస్తారు కాబట్టి జాగ్రతలు పాటించాలని మరియు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ జాగ్రతగా వాహనాలను నడుపుతూ ప్రశాంతంగా, క్షేమంగా తమ గమ్య స్థానాలకు చేరుకొని సంతోష కరంగా పండుగను జరుపుకోవాలని జిల్లా ఎస్‌పి తెలిపినారు.ప్రజలు పోలీసులతో సమన్వయంగా సహకరిస్తే చోరీలను నియంత్రించవచ్చు అని సంతోష కరమైన పండుగ ను ముందస్తూ జాగ్రతలతో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు లేకుండా జరుపుకోవాలని జిల్లా ఎస్.పి తెలిపినారు.