చేవెళ్ల సెప్టెంబర్ 27 ( Studio10tv ప్రతినిధి ) : మండల కేంద్రంలో తెలంగాణ సాధనకు అహర్నిశలు కష్టపడ్డ కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా చేవెళ్ల పట్టణ కేంద్రంలో వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన చేవెళ్ల బిజెపి నాయకులు. ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు అడ్డెట్ల శ్రీనివాస్ మరియు మండల ప్రధాన కార్యదర్శి అత్తిలి అనంతరెడ్డి మాట్లాడుతూ.. నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ కొమరంభీం జిల్లా, వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించాడు. [1] స్వాతంత్ర్యోద్యమంలో, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. 1952లో ఆసిఫాబాదు నుంచి ఎన్నికై హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత కూడా శాసనసభ్యుడిగా నుంచి ఎన్నికై 1971 వరకు శాసనసభ్యునిగా కొనసాగినాడు. నిఖార్సయిన తెలంగాణ వాది. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త. 1969, 2009-12 తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నాడు. రాష్ట్ర చేనేత సహకార రంగానికి కూడా కృషిచేశాడు తెలంగాణ సాధనకు అహర్నిశలు కష్టపడ్డా కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కృష్ణ గౌడ్, శేర్వలింగం బిజెపి నాయకులు కుంచం శ్రీనివాస్ జయశంకర్, మధుసూదన్ రెడ్డి, శంకరాచారి, చంద్రశేఖర్ రెడ్డి, కృష్ణ, ప్రకాష్ గణేష్,హర్షిత్, ప్రకాష్, భార్గవ్ రెడ్డి , జై సింహ , రఘునాథ్ రెడ్డి నవీన్, ఉపేందర్, త్రినేత్ర ,శ్రీతం, చంద్రం, జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.