సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా.
తేది -27-09-2024.
మండల స్థాయి కళా ఉత్సవాలు శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేలి ఘనపూర్ నందు జరిగినవి. ఇట్టి మండల స్థాయి కళా ఉత్సవాలలో మండలంలోని పాఠశాల విద్యార్థులు పాల్గొని పాటలు నృత్యం నటన మిమిక్రీ పలు రకాలుగా అలరించారు. ఈ సందర్భంగా SCERT డైరెక్టర్ గాజర్ల రమేష్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే బాలలు చక్కని కళా ప్రదర్శన ఇవ్వడం సంతోషకరమని అన్నారు. సృజనాత్మకతమైన శైలి చిన్నప్పుడే బాలల్లో అలవర్చుకుంటే ఉన్నతులుగా ఎదుగుతారని అన్నారు. ప్రాథమిక పాఠశాలలో మూడవ తరగతి, ఉన్నత పాఠశాలలో 6.9 తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారు. చక్కని విద్యా బోధన చేస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు. గ్రూప్ నృత్య విభాగంలో రోజా బృందం హవేలీ ఘనపూర్ సింగిల్ జోషిక కూచన్ పల్లి, పాటలు శరబయ్య బూరుగుపల్లి మిమిక్రీ వినయ్ హవేలీ ఘనపూర్, కథ చెప్పడం సాయిచరణ్ మహాత్మ జ్యోతిబాపూలే చిత్రలేఖనం వినయ్ మహాత్మ జ్యోతిబాపూలే విద్యార్థులు మండల స్థాయిలో విజేతలుగా నిలిచారు.మండల స్థాయి కళా ఉత్సవాల కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి రాధకిషన్ రావు సుదర్శన మూర్తి హవెలిఘనపూర్ మండల విద్యాధికారి మధు మోహన్ మెదక్ మండల విద్యాధికారి నీలకంఠం కరుణాకర్ నాగుల్ మీరా శ్రీనివాస్ ఉపాధ్యాయులు ఉండ్రాళ్ళ రాజేశం శశి కుమార్ నల్ల అశోక్ రమేష్ మండల సిబ్బంది పాల్గొన్నారు.