మహిళా సాధికారతే లక్ష్యం కలెక్టర్*మహిళా సంఘాల సభ్యులు 100% అక్షరాస్యత సాధించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా.

మెదక్ తెలంగాణ భవన్ లో మహిళా సంఘాల వార్షికోత్సవ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాహుల్

మహిళా సాధికారతే లక్ష్యంగా జిల్లా సమైక్య ప్రగతి పథంలో ముందుకు పోవడం శుభపరిణామమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు
బుధవారం తెలంగాణ భవన్ లో మెదక్ జిల్లా సమాఖ్య 7వ వార్షిక సర్వ సభ్య సమావేశానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరైనరు
ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో13063 మహిళా సంఘాల గ్రూపులు కలవని 2024-25 సంవత్సరంలో 214 కోట్ల రుణాలు అందించడం జరిగిందని, మహిళా సంఘాల సభ్యులు 100% అక్షరాస్యత సాధించాలని మహిళ ఆర్థిక స్వాలంబనే లక్ష్యంగా ముందుకు పోతూ సామాజిక కార్యక్రమాలు అయిన బాల్య వివాహాలు జరుగ కుండా చూడాలని వరకట్న నిషేధం జరిగేలా చూడాలి అన్నారు. తీసుకున్న రుణాలు వినియోగ అవసరాలకు వాడకుండా ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకోవాలి అని వచ్చిన ఆదాయంతో వినియోగ అవసరాలు తీర్చుకోవాలి అన్నారు.అమ్మ ఆదర్శ పాఠశాల పనులు వివోల ద్వారా సమర్ధ వంతముగా నిర్వహించాలి అన్నారు.ఈ సర్వ సభ్య సమావేశంలో 2023-24 వార్షిక సంవత్సరంలో లో జిల్లా సమాఖ్య ద్వారా అమలు పరచిన కార్యక్రమాల నివేదిక చదివి వినిపించడం జరిగిందన్నారు.
వార్షిక లెక్కలకు మరియు 2024-25 వార్షిక సంవత్సరంలో చేయబోవు ప్రణాళికకు మహాసభ ఆమోదము తెలిపింది అన్నారు. అనంతరం 2023-24 వార్షిక సంవత్సరము లో ఉత్తమ ప్రతిభ కనబరచిన తూప్రాన్ మనోహర బాద్ చెగుంట నర్సాపూర్ హవేలీ ఘనపూర్మెదక్ మండలాల అధ్యక్షురాళ్ళను మరియు సంబధిత మండల ఎపిఏం లను జిల్లా కలెక్టర్ శాలువాతో సన్మానించి మెమోంటో లు అందచేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి సిఎచ్ శ్రీనివాస్ రావు అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
బి.సరస్వతి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు నవనీత జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు మండల సమాఖ్య ల పదాది కారులు జిల్లా సమాఖ్య సిబ్బంది పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!