సిల్వర్ రాజేష్ స్టూడియో 10 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా.
అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి
బాద్యతయుతంగా విదులు నిర్వహించాలి
ప్రతి ఒక్కరూ సామాజిక బాద్యత కలిగి ఉండాలి
విది నిర్వహణలో అంకిత బావంతో పని చేయాలి
అనుమతులు లేని కళ్ళు దుఖానాలపై చర్యలు
రియల్ ఎస్టేట్ మాఫియా, భూ కబ్జా దారులపై కఠిన చర్యలు
ఈ రోజు(బుధవారం) మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని మల్టీ జోన్ 1 ఐ.జి.పి.ఎస్.చంద్రశేఖర్ రెడ్డి,ఐ.పి.యస్.సందర్శించినారు. మల్టీ జోన్ 1 ఐ.జి.పి.ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, ఐ.పి.యస్.కి జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.యస్., గారు పూల మొక్కతో సాదర స్వాగతం పలికినారు. అనంతరం పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బంది నుండి గౌరవవందనం స్వీకరించారు. తరువాత పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో “సమీక్ష సమావేశం” నిర్వహించారు.
మల్టీ జోన్ 1 ఐ.జి.పి ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, ఐ.పి.యస్ .కి జిల్లా ఎస్.పి. శ్రీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.యస్. PPT ప్రెసెంటేషన్ ద్వారా జిల్లా సమగ్ర సమాచారాన్ని తెలియజేసినారు.
ఈ సందర్భంగా మల్టీ జోన్ 1 ఐ.జి.పి ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, ఐ.పి.యస్ జిల్లా సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. జిల్లా పోలీస్ సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. నేర విచారణలో జాప్యం జరగకుండా బాధితులకు సత్వర న్యాయం చేకూరేలా బాధ్యతగా పనిచేయాలని సూచించారు. సామాన్య ప్రజానికానికి ఇబ్బందులు కలిగే విధంగా ప్రవర్తించే ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అలాగే జిల్లాలో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెదక్ జిల్లా హైదరాబాద్ నగరానికి సమీపంగా ఉన్నందున గుర్తు తెలియని మృతదేహాలను ఇక్కడ పడవేసే అవకాశం ఉన్నందున జాతీయ రహదారుల వెంట మరియు నర్సాపూర్ అటవీ ప్రాంత రావదారుల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని అన్నారు.సిసి కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. ఒకవేళ దొంగతనం జరిగినా సిసి కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవచ్చని చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా ఎన్నో నేరాలు అరికట్టడం జరిగిందని అన్నారు. జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అన్ని గ్రామాలలో,పట్టణాల్లో సిసి కెమెరాల ఏర్పాటు చేసే విధంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కృషి చేయాలని చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని, మరియు ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే తెలుసుకోవచ్చని సీసీ కెమెరాలు రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణగా నిలుస్తాయని తెలిపినారు. నేరాలను అదుపు చేయడం, అసాంఘిక కార్యకలాపాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించి పట్టుకోవడంలో సిసి కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఎన్నో దొంగతనాలు, హత్యలు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సిసి కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకొని కేసులు చేధించడం జరిగిందని అన్నారు. అలాగే కల్తీ కళ్ళు దుఖానాలపై నిఘా ఏర్పాటు చేసి అనుమతులు లేని కల్తీ కళ్ళు దుఖానాలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇంటి స్థలం కానీ వ్యవసాయ స్థలం కొనుక్కోవాలనుకునే సామాన్యుల అమాయకత్వమే వ్యాపారస్తుల ఆదాయవనరుగా మారుతోందని ఎవరైనా ఇంటి స్థలం కానీ వ్యవసాయ స్థలం కొనుక్కోవాలనుకునే ప్రజలు తగు జాగ్రత్తలు, స్థలానికి సంబందించిన సరియైన దృవ పత్రాలు ఉన్నాయా లేవా అని సారి చూసుకోవాలని అట్టి స్థలం సరియైనదేనా లేక రియల్ ఎస్టేట్ చేసే మోసగాళ్ల పనా అని ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవాలని డబ్బులు ఎవరికి ఊరికే రావని తాము ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులను తమ పిల్లల భవిష్యత్తు కోసం స్థిరాస్తుల పై పెట్టుబడిగా పెడతారని అలాంటి వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు రియల్ ఎస్టేట్ పేరిట మోసాలకు పాల్పడుతున్నారని పేద మధ్యతరగతి వర్గాలు కొనుగోలు చేసి ఇబ్బందుల పాలు అవుతున్నారని మరియు ఆర్థికంగా నష్టపోతున్నారని ప్రజలను మోసం చేస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియాపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించినారు.
ఈ సామావేశం లో జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.తో పాటు జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్.ఎస్.మహేందర్,మెదక్ డిఎస్పీ.ప్రసన్న కుమార్ తూప్రాన్ డిఎస్పీ.వెంకట్ రెడ్డి జిల్లా సిఐలు ఎస్.ఐలు పాల్గొన్నారు.