సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా.
ప్రభుత్వ అధికారులు సిబ్బంది సమయపాలన తప్పనిసరి.
ప్రతి శాఖకు సంబంధించిన ఫైలు ఈ ఆఫీస్ ద్వారానే పరిష్కరించడం జరుగుతుంది.
అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలి.
ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయాలంటే అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులు ఆదేశించారు.
మంగళవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తో కలిసి అన్ని శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా సమర్థవంతమైన పాలన లక్ష్యంగా ముందుకు పోతున్నామని ఇందుకుగాను
అన్ని శాఖల అధికారులు సమన్వయం చాలా అవసరమని చెప్పారు అత్యవసర పరిస్థితుల్లో అధికారులు సెలవు పై వెళ్ళినప్పుడు తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ గారి అనుమతి తీసుకోవాలన్నారు 26వ తారీఖున ఇన్చార్జి మంత్రివర్యులు సమావేశం ఉన్నందున అభివృద్ధి సంక్షేమ పథకాల సమగ్ర సమాచారాన్ని తయారు చేసుకుని వివరించాలన్నారు మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన చేపట్టాలన్నారు అమ్మ ఆదర్శ పాఠశాలల పరిశీలన చేసి నివేదికల సమర్పించాలన్నారు సివిల్ రైట్స్ డే ,ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు అన్ని గ్రామపంచాయతీలో అవగాహన కల్పించాలన్నారు జిల్లాలో కుల బహిష్కరణలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు కలెక్టరేట్ కార్యాలయంలో అన్ని శాఖల లో సీసీటీవీ కెమెరాల అమర్చాలని చెప్పారు. ఈ ఆఫీస్ ద్వారా చేపట్టే ప్రతి ఫైలు ఎప్పటికీ భద్రంగా ఉంటుందని మాన్యువల్ ఫైల్స్ ఇకనుండి చూడడం జరగదని అన్నారు జిల్లాను టూరిజం స్పాట్ గా రూపొందించే విధంగా టూరిజం ప్రాంతాలను గుర్తించి లిస్టు రూపొందించి డాక్యుమెంటేషన్ రూపంలో భద్రపరిచేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు
జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులకు తగు సూచనలు చేశారు
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సంబంధిత అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు