సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా.
తేది 24-09-2024.
34 సంవత్సరాలుగా అల్పోర్స్ విద్యా సంస్థ ద్వారా ఎంతో మంది విద్యావంతులుగా తయారుచేసి తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు దీటుగా సత్ఫలితాలు సాధించడం జరిగిందని అన్నారు. యువత కు, నిరుద్యోగులకు ఎందుకు ఆదర్శంగా ఉండకూడదని, పెద్దల సభ లో మన వాణిని వినిపించాలని ఒకే ఒక్క లక్ష్యం తో పట్టభద్రుల ఎమ్మెల్సీ కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీ లకు అతీతంగా ముందుగా ఎన్రోల్మెంట్ ప్రక్రియ ను వేగవంతం చేసుకోవాలని అన్నారు. మెదక్ జిల్లా లో సుమారు 1 లక్ష మంది పట్టభద్రుల ఉన్నప్పటికీ అందులో 17 వేల ఎన్రోల్మెంట్ లు మాత్రమే అయ్యానని, దీనికి కారణం పట్టభద్రులకు, నిరుద్యోగులకు లాభం ఏంటని ఇప్పటి వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ గా గెలిచిన వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోపోవడమే దీనికి ముఖ్య కారణమని అన్నారు. అందువల్లనే పట్టభద్రుల ఎన్రోల్మెంట్ లు తగ్గాయని, ఇందుకు భిన్నంగా ఎన్రోల్మెంట్ లు పెంచాలని ఉద్దేశంతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. తప్పకుండా ప్రతి పట్టబద్రుడు కూడా ఎన్రోల్ చేసుకోవాలని కోరారు. గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ లో ఓటు వినియోగించుకున్న వారు కూడా మళ్లీ ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎన్రోల్ చేసుకునేందుకు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ జిరాక్స్, కలర్ ఫోటో, పారం -18 ను నింపి ఆన్లైన్లో దరఖాస్తు చేసి అనంతరం ఎమ్మార్వో కార్యాలయంలో ఇవ్వాలని అన్నారు. కానీ ఇవ్వన్నీ లేకుండా మీ కోసం ఇక్కడ ఆఫీస్ ఏర్పాటు చేస్తానని సంబంధిత పత్రాలు సమర్పించినట్లైతే ఎన్రోల్మెంట్ ప్రక్రియ మేమే పూర్తి చేస్తామని అన్నారు. ముఖ్యంగా నిరుద్యోగులు నిర్ణీతమైన జాబ్ క్యాలెండర్ లేకుండా డిగ్రీ చదువుతున్నది ఎందుకనే భావన లో ఉండిపోతున్నారని, గతం 20సం. రాల క్రితం డిగ్రీ చదివితే కష్టపడి చదివి ఒక గ్రూప్ -1 అధికారి టిచర్ అవుతననే భావన లో ఉండేవారని కానీ ఇప్పుడు ఉద్యోగాలు వస్తాయి రావో అనే భావన లో ఉన్నారని అన్నారు.