మంత్రాలయం (ఎమ్మిగనూరు) న్యూస్21:-పేదవాడి ఆకలి తీర్చేందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారని, ఈ అన్న క్యాంటీన్ లు పేదవాడికి ఎంత దోహదపడుతుందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్, శ్రీనివాస థియేటర్ ఎదురుగా రెండు అన్న క్యాంటీన్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అల్పాహారంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్ లను మూసివేసి పేదల కడుపు కొట్టిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పునః ప్రారంభం చేశారని పేర్కొన్నారు. పేదలు వివిధ పనులు మీద పట్టణానికి వస్తుంటారని వీరికి రూ. 5 కే అల్పాహారం, భోజనం అందించాలన్నదే ప్రభుత్వం ఉద్దేశం అన్నారు. ప్రజలు అందరూ కుడా అన్న క్యాంటిన్ లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.