మంత్రాలయం (ఆదోని) న్యూస్ 21:-కర్నూలు జిల్లాఆదోని మండలం నాగలాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈడిగ పెద్ద వీరేష్ గారి కుమారుడు నరసింహులు వ్యవసాయం జీవన వృత్తిగా ఉంటూ జీవిస్తున్న క్రమంలో అప్పులు ఎక్కువై అప్పుల బాధతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి గురై మృతి చెందడం జరిగినది ఆదోని టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆదోని ఏరియా హాస్పిటల్ కు వెళ్లి మృతి చెందిన నరసింహులు గారికి నివాళులర్పించి వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తూ టిడిపి అధిష్టానం దృష్టికి కూడా తీసుకువెళతానని పార్టీ అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలియజేస్తూ మట్టి ఖర్చులకు ఆర్థిక సహాయం చేయడం జరిగినది.