ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించనున్న వ్యవసాయ కమిషన్ చైర్మన్ శ్రీ ఎం. కోదండ రెడ్డి

సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టీవీ ప్రతినిధి మెదక్ జిల్లా.

అనివార్య కారణాలవల్ల కె. కేశవరావు ప్రభుత్వ సలహాదారు పర్యటన రద్దు*కలెక్టర్
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

ప్రజా పాలన దినోత్సవ ఏర్పాట్లు పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు సమీకృత కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఎం.కోదండ రెడ్డి పతాక ఆవిష్కరణచేయనున్నట్లు
ప్రభుత్వ ఆదేశాలు కలవని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆదివారం ప్రజా పాలన దినోత్సవం గురించి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ సెప్టెంబర్ 17 మంగళవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం వేడుకలకు గౌరవ ముఖ్య అతిథి ప్రభుత్వ సలహాదారు డాక్టర్. కే.కేశవరావు గారు పతాక ఆవిష్కరణ గలదని గతంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక ప్రకటన ద్వారా తెలపడం జరిగిందని వివరించారు.
అనివార్య కారణాలవల్ల కే కేశవరావు గారి పర్యటన రద్దు అయిందని ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ కమిషన్ చైర్మన్ శ్రీ ఎం కోదండ రెడ్డి మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సెప్టెంబర్ 17 మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రజా పాలన దినోత్సవంసందర్భంగా
పతాక ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా హాజరవుతారని అనంతరం ముఖ్యఅతి గారి సందేశం ఉంటుందన్నారు.
ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసే ఆహ్వానితులకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ ఏర్పాట్లు చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!