సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా
తేది -08-09-2024.
ఉత్సవ కమిటీలు, మండపాల నిర్వాహకులు, ప్రజలు పోలీస్ అధికారులకు సహకరించాలి
ఈ మెదక్ జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.అల్లాదుర్ సర్కిల్ కార్యాలయం సందర్శించి అధికారులకు పలు సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వినాయయక నవరాత్రులు నిమజ్జనాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని నిమజ్జన ప్రదేశంలో బారికెడ్లు శోభయాత్ర సమయంలో ట్రాఫిక్ మల్లింపు ఇతర సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేసారు.ఉత్సవ కమిటీలు మండపాల నిర్వాహకులు ప్రజలు పోలీస్ అధికారులకు సహకరించాలని కోరారు. అధికారులు అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి వినాయక నవ రాత్రులను, నిమజ్జనాలను ప్రశాంతంగా పూర్తిచేయాలని సూచించారు.అలాగే అల్లాదుర్గ్ సర్కిల్ పరిధిలో నమోదు అయిన కేసుల వివరాలు ఎస్సీ.ఎస్టీ ఫోక్సో కేసుల గ్రేవ్ కేసులలో అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్న కేసుల వివరాల అడిగి తెలుసుకుని పలు సూచనలు చేసి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లలోఎక్కువగా నమోదవుతున్న కేసుల వివరాలను అడిగి తెలుసుకొన్నారు. శాంతిభధ్రతల పరిరక్షణ మహిళా సమస్యల పరిష్కారం ప్రాధాన్యతగా విధులుండాలని ఆదేశించారు. సర్కిల్ పరిధిలో నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నేరాల నియంత్రణకై ప్రతి పోలీస్ స్టేషన్ లో పెట్రోలింగ్ విజిబుల్ పోలీసింగ్ లు నిర్వహించాలన్నారు.లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే సంఘటనలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేర నియంత్రణలో భాగంగా సర్కిల్ పరిధిలోని ప్రతి గ్రామంలో లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అందుకు అనుగుణంగా ప్రజలకి వాటి ద్వారా కలిగే ప్రయోజనాలని అవగాహన కల్పించాలన్నారు. సర్కిల్ పరిధిలో జరిగే చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలపై కఠినంగా వ్యవహారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమం లో మెదక్ డిఎస్పీ.ప్రసన్న కుమార్ అల్లదుర్ఘ్ సీఐ.రేణుకా రెడ్డి సర్కిల్ ఎస్.ఐ లు పాల్గొన్నారు.