సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టీవీ ప్రతినిధి మెదక్ జిల్లా
తేది -08-09-2024.
ప్రజలు ఎవరు అధైర్యపడవద్దు ప్రభుత్వం అండగా ఉంది.
మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండల్ క్షేత్రస్థాయిలో భారీ వర్షాలకు నష్టపోయిన ఇండ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్.
ఆదివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా
సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ హవేలీ ఘన్పూర్ మండలంలో విస్తృతంగా పర్యటించి అధిక వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎవరు అధైర్యపడవద్దని ప్రభుత్వం అండగా ఉందని హవేలీ ఘన్పూర్ మండలంలో భారీ వర్షాలకు 25 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని 01 పూర్తిస్థాయిలో నష్టం వాటిలిందని తెలిపారు. కూలిపోయే దశలో ఉన్న ఇండ్లలో నివసించే వారికి వెంటనే ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ భవనాలలో పునరావాసం కల్పించాలని అన్నారు.కూలిపోయిన ఇండ్లకు గాను ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని హామీఇచ్చారు.జిల్లాలో భారీ వర్షాలు వరద నష్టాన్ని యుద్ధ ప్రాతిపదికన అంచనా
వేసేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని వివరించారు.గ్రామంలో ప్రజలు వ్యక్తిగత శారీరక పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించి
సీజనల్ వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు.జిల్లా పంచాయతీ అధికారి వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో ప్రజలను జ్వరాలు బారిన పడకుండా రక్షించడానికి పగడ్బందీగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో హవేలీ ఘన్పూర్ తాసిల్దార్ నవీన్ సంబంధిత అధికారులు ప్రజలు పాల్గొన్నారు.