రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ప్రభుత్వం తగు సహాయక చర్యలు చేపడుతుంది. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగుల సైతం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనిని అతిపెద్ద విపత్తుగా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ భావించింది.
రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతగా నిలిచిందుకు జేఏసీ ముందుకొచ్చింది. అందులో భాగంగా రాష్ట్రంలోని ఉద్యోగుల తరుపున ఒక రోజు మూల వేతనాన్ని ప్రభుత్వానికి ఇచ్చేందుకు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి తమ వంతు సహాకారంగా, బాధ్యతగా భావించి ఒక రోజు వేతనం వరద సహాయక చర్యలకు అందించడం జరుగుతుంది.
వి.లచ్చిరెడ్డి, ఛైర్మన్
తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ