- తెలుగు రాష్ట్రాలకు రూ. కోటి విరాళం
గతవారం కురిసిన భారీ వర్షాలకు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు భారీ స్థాయిలో ఎఫెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ మరియు కృష్ణా జిల్లాలు, తెలంగాణలోని ఖమ్మం జిల్లా వరద భీభత్సానికి అతలాకుతలమైంది. ఇరు ప్రాంత ప్రజలకు అండగా ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ హీరోలు కూడా తమ వంతు సాయం అందించేందుకు రంగంలోకి దిగారు.ఇవాళ ఉదయం జూనియర్ ఎన్టీఆర్ తనవంతు సహాయంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల రూపాయలను ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రుల సహాయ నిధికి ప్రకటించారు. ఎన్టీఆర్ (జూనియర్) తోపాటు విశ్వక్ సేన్ కూడా ఓ 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఎన్టీఆర్ చొరవ తీసుకున్నారు కాబట్టి.. ఇప్పుడు మిగతా హీరోలందరూ ముందుకొచ్చి తమ దాతృత్వాన్ని ఏ విధంగా చాటుకొంటారో చూడాలి.