స్టూడియో 10 టీవీ న్యూస్, ఆగస్టు 30, మహానంది:
మహానంది మండలం గాజులపల్లె ఆర్. ఎస్-చలమ రైల్వే స్టేషన్ల మధ్యనున్న నల్లమల అడవిలోని రైలుమార్గంలో శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో అధిక లోడ్తో కొండగుట్టల దారిని ఎక్కలేక గూడ్స్ రైలు ఆగిపోయింది. దీంతో విజయవాడ-హుబ్లీ మధ్య నడుస్తున్న ప్యాసింజర్ రైలు నల్లమల అడవిలోని చలమ ఆర్. ఎస్. స్టేషన్లో నిలిపేయాల్సి వచ్చింది. ఈ సమాచారాన్ని నంద్యాల రైల్వేస్టేషన్లోని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో నంద్యాల నుంచి ప్రత్యేకంగా ఇంజిన్ను తెప్పించి, కొండమార్గం ఎక్కించి విజయవాడవైపు పంపేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అంతవరకు కొన్ని రైళ్లు నంద్యాల,మరికొన్ని ప్రకాశం జిల్లా గిద్దలూరులోనే నిలిచిపోయినట్లుగా హుబ్లీలోని ప్యాసింజర్లు తెలిపారు. అయితే తమ ప్రయాణం ఎందుకు ఆలస్యమైందో, తమ కుటుంబ సభ్యులకు తెలిపేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, చరవాణులకు సిగ్నల్స్ కోసం చాలా ఇబ్బందులు పడ్డామని తెలిపారు.