హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా శక్తి స్కీం లో భాగంగా శనివారం తార్నాక డివిజన్, లాలాపేట్ లోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియం వద్ద మహిళా క్యాంటీన్ ను గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి టిటియుసి రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా, డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ వచ్చే ఐదు సంవత్సరాలలో మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఇంద్ర మహిళ శుద్ధి పథకాన్ని శ్రీకారం చుట్టిందని తెలిపారు, మహిళా శక్తి స్కీం మహిళల ఆర్థిక శక్తివంతత కోసం కీలకంగా పని చేస్తుందని, ఈ క్యాంటీన్ మహిళల స్వయం ఉపాధికి ముఖ్యమైన మద్దతు అని పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డి పీ ఓ శ్రీనాథ్, శ్రీవాణి,మహిళా సెల్ఫ్ హెల్త్ గ్రూప్ సభ్యులు, వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు