దొంగతనాల నివారణకు కట్టుదిట్టమైన తనిఖీలు
ప్రత్యేక టీంలు ఏర్పాటు
జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.*
సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టీవీ ప్రతినిధి మెదక్ జిల్లా.
అనుమానితుల సమాచారం ఇవ్వండి కొత్త వ్యక్తుల కదళికలను తెలియజేయండి
దొంగతనాలు నేరాల నిర్మూలనకై శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ లో తనిఖీలు
కమ్యూనిటీ కాంటాక్ట్ పోలీసింగ్ ప్రోగ్రాం లో భాగంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని దీనికి ప్రజలు సహకరించాలి.
ఈ రోజు మెదక్ జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. ఆదేశానుసారం మెదక్ పట్టణ మరియు మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ ల పరిది అవుసులపల్లి వద్ద మెదక్ డి.ఎస్.పి.ప్రసన్న కుమార్ ఆద్వర్యంలో మెదక్ పట్టణ సిఐ.నాగరాజు మెదక్ రూరల్ ఎస్.ఐ.మురళి మరియు హవేలి ఘనపూర్ ఎస్.ఐ. సత్యనారాయణ సిబ్బంది మొత్తం 45 మంది పోలీసు అధికారులతో ఆకస్మికంగా కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా తనిఖీలు నిర్వహించి సోదాలు నిర్వహించాం అన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.మాట్లాడుతూ మీ కాలనీలో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే డయల్ 100 కు గాని సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసిన వెంటనే చర్యలు చేపడతామన్నారు.తనిఖీలు నిర్వహించడం వలన దొంగతనాలు నేరాల రేటు తగ్గుతాయని ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపారు.నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని ప్రజల రక్షణ ప్రజలకు భద్రత భావం సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
అలాగే చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం
జరుగుతుందన్నారు. వాహనాలు నడిపే టప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలి అన్నారు.చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు.వాహనాల సంబందించిన ధ్రువపత్రాలు రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ కలిగి ఉండాలి అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉండి ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో ఇన్సూరెన్స్ వర్తించదు మరియు ఇన్సూరెన్స్ గడువు ముగిషాక ముందే దానిని రినివల్ చేపించుకోవాలని సూచించారు.మహిళలు యువతులు చిన్నపిల్లలతో మర్యాదగా ప్రవర్తించి వారిని గౌరవించాలి.మన కుటుంబ సభ్యులతో ఎంత మర్యాదగా ఉంటామో బయట వారితో కూడా అలాగే మెదలాలని సూచించారు.మహిళ పట్ల చిన్న పిల్లలపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని మానసిక శారీరకంగా హింసించిన వారిపట్ల చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని తెలిపారు.ప్రజలు మహిళలు ఆపద సమయంలో ఎవరైనా చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన యువకులు గుంపులు గా ప్రజా శాంతికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు.సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగానే కమ్యూనిటీ కాంటాక్ట్ పోలీసింగ్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. కాలనీలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ.కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని భద్రతా పరమైన అంశాలలో సీసీ కెమెరాలు కీలక పాత్ర వహిస్తాయని తెలిపారు.