పాలకమండలిలో వాల్మీకులకు అవకాశం కల్పించండి..

-ఎంవిఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బోయ పులికొండన్న..

స్టూడియో 10 టీవీ న్యూస్, ఆగస్టు 30, మహానంది:

ప్రముఖ శైవ క్షేత్రలైన శ్రీశైలం,మహానంది దేవస్థానాల పాలక మండలిలో వాల్మీకులకు అవకాశం కల్పించాలని ఎంవిఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బోయ పులికొండన్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు .దేవస్తానాలలోనే కాక ఇతర నామినేటెడ్ పోస్టులలో కూడా అవకాశం వాల్మీకులకు పాలకులు కల్పించలేదన్నారు. ఇప్పుడున్న తెదేపా ప్రభుత్వం వాల్మీకులకు ఖచ్చితంగా అవకాశం కల్పిస్తుందనే నమ్మకం ఉందని, కొండన్న ఆశాభావం వ్యక్తం చేశారు.శుక్రవారం మహానందిలో వారు మాట్లాడుతూ.. నంద్యాల జిల్లాలో 2లక్షలకు పైగా వాల్మీకుల ఓటు బ్యాంకు ఉన్నా, నామినేటెడ్ పోస్టులలో వాల్మీకులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని, కనుక ప్రభుత్వం న్యాయ చెయ్యాలని కోరుతున్నామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రకార్యదర్శి గాజులపల్లె జయరామ్, శ్రీశైల నియోజకవర్గ నేతలు తలారి రామచంద్రుడు, రాజు,శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!