ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలంలో శివసదనంలో దోర్నాల మండలం భాజపా పార్టీ అధ్యక్షుడు సురవరం గండి వీరారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ రెండో తేదీ నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం పున ప్రారంభమవుతుందని దోర్నాల మండలం 42 బూతుల కమిటీ సభ్యులతో ప్రతి బూతు నుండి 200 సభ్యత్వాలు చేసే విధంగా తిసభ్య కమిటీ వేశామన్నారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ నెంబర్ మల్లారెడ్డి, మైనారిటీ మోర్చా స్టేట్ కౌన్సిల్ మెంబర్ సయ్యద్ ఖాసింపీర, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు అల్లు రెడ్డి, ఉపాధ్యక్షులు రామలక్ష్మీరెడ్డి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పుప్పాల గాలయ్య, నాయకులు కుడుముల అంకన్న తదితరులు పాల్గొన్నారు.