రామాయంపేట (స్టూడియో 10 టీవీ ప్రతినిధి) ఆగస్టు 22:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఐరేని రవీందర్ గౌడ్ వారం రోజుల క్రితం తీవ్ర అస్తవ్యస్తతకు గురైన అయనను హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ అస్పటల్ లో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు చేర్పించారు.అయితే గురువారం మధ్యాహ్నం ఆయన అస్పటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.అయన మరణ వార్త విన్న తోటి మిత్రులు ఒక్కసారిగా అవ్వక్కయ్యారు.అందరితోె కలసి మెలసి కలుపుగోలుగా ఉండే ఆయన మరణవార్తను జీర్ణించు కోలేకపోయారు.ఈ-సందర్భంగా వారితో కలిసి పని చేస్తున్న తోటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు రామాయంపేట గౌడ సంఘం వారు మాట్లాడుతూ రవీందర్ గౌడ్ అకాల మరణాన్ని జీర్ణించులేక పోతున్నామని తెలిపారు.ఈ మేరకు ప్రధానోపాధ్యాయుడు ఐరేని రవీందర్ గౌడ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.రేపు శుక్రవారం ఉదయం 11 గంటలకు స్వగ్రామమైన రామాయంపేటలో అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు.