-ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసులు గా ఉంటూ న్యాయాన్ని కాపాడండి..
-తెదేపా నాయకులు వి. మహేష్..
స్టూడియో 10 టీవీ న్యూస్, ఆగస్టు 13, సిరివెళ్ళ:
సిరివెళ్ల మండల కేంద్రానికి నూతనంగా ఎస్సైగా బాధ్యతలు చేపట్టి సిరివెళ్ల పోలీస్ స్టేషన్ కు వచ్చిన సందర్భంగా మహాదేవపురం టిడిపి నాయకులు ఎస్సై పీరయ్యను కలిసి శాలువా, పూలమాల,వేసి స్వాగతించినట్లు టిడిపి నాయకుడు వి. మహేష్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శాంతి భద్రతలను పరిరక్షించడం అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలకు చోటు ఇవ్వకుండా ఉన్నతాధికారుల ఆదేశాలు అమలుపరుస్తూనే చట్టాన్ని రక్షిస్తూ న్యాయాన్ని కాపాడంలో ప్రేక్షక పాత్ర వహిస్తూ ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసు గా ఉంటూ న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చే వారి యొక్క సమస్యలపై న్యాయ అన్యాయాలను క్షుణ్ణంగా పరిశీలించి న్యాయాన్ని గెలిపించే దిశగా విధులు నిర్వహించాలని అదేవిధంగా తమ యొక్క విధులకు మా యొక్క సహాయ సహకారాలు అన్నివేళలా అందిస్తామని మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకులు శంకర్, మాలిభాష, చిన్నా , దత్తాత్రేయ, మధు, విక్టర్ లు పాల్గొన్నారు.