సిల్వర్ రాజేష్ స్టూడియో 10టీవీ ప్రతినిధి మెదక్ జిల్లా
తేది -7-8-2024.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పంజ విజయ్ కుమార్
- నాలుగు గంటల పాటు ఆస్పత్రిలో బాధితులకు అండగా..
పంజ విజయ్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన తల్లిదండ్రుల
భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కార్యాలయం – మెదక్
ఇచ్చిన మాట ప్రకారం నాలుగు గంటల పాటు ఆస్పత్రిలో ఉండి తమ కుమారుడికి ప్రత్యేక చికిత్స అందేలా కృషి చేసిన బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ్ నిజాంపేట్ మాజీ జెడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన సంఘటన మెదక్ పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే మెదక్ పట్టణానికి చెందిన కాస అరవీంద్‌కుమార్ ప్రవళిక దంపతులకు నేహాన్‌సాయి కుమారుడు. కాగా నేహాన్‌సాయి పుట్టుకతోనే డెవలప్‌మెంట్ డిలే (బుద్ది మంధ్యత) లోపంతో బాధపడుతున్నాడు. దీంతో తల్లిదండ్రులు ఎన్నో ఆస్పత్రులకు తీసుకెళ్లిన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సరైన చికిత్సను చేయించలేకపోయారు.
కాగా గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఇంటింటి ప్రచారంలో భాగంగా నేహాన్‌సాయికి ఉన్న లోపాన్ని తల్లిదండ్రులు పంజ విజయ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లగా తాను తప్పకుండా దగ్గరుండి బాలుడికి చికిత్స చేయిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నేహాన్‌సాయికి సికింద్రాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో నాలుగు గంటల పాటు నేహాన్‌సాయితో ఉండి డాక్టర్లతో మాట్లాడి ప్రత్యేక చికిత్సను అందేలా పంజా విజయ్ కుమార్ కృషి చేశారని తల్లిదండ్రులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పంజా విజయ్‌కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పంజ విజయ్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ నాయకులు కార్యకర్తలకు తానెప్పుడు అండగా ఉంటానని ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడు కృషి చేస్తానని ఆయన హామీనిచ్చారు.