ఉప్పరపల్లి లో ఇన్చార్జి జిల్లా మలేరియా అధికారి పి.జె.ఎం.అర్.పి.నాయుడు ఆకస్మిక సందర్శన.
అనకాపల్లి జిల్లా యస్. రాయవరం మండలం సర్వసిద్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి ఉప్పరపల్లి గ్రామంలో జిల్లా ఇన్చార్జి మలేరియా అధికారి పి.జె.ఎం.అర్.పి.నాయుడు ఆకస్మికంగా సందర్శించారు. వీరితో పాటు ఆరోగ్య విస్తరణ అధికారి టి. నాగేశ్వరరావు,ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్లినిక్ క్లస్టర్ పర్యవేక్షకులు డాక్టర్ పి.ఎన్.వి.ఎస్.ప్రసాద్ ,కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కె.శ్రావణి, హెల్త్ సెక్రటరీ జి.వరలక్ష్మి వున్నారు .ఈ సందర్భంగా కీటక జనిత వ్యాధులపై నిర్వహించిన అవగాహన శిబిరం ను ఉద్దేశించి జిల్లా ఇన్చార్జి మలేరియా అధికారి పి.జె.ఎం.అర్.పి.నాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని,వాటిపై మూతలు వుండేలా చూసుకోవాలనీ తద్వారా మలేరియా ,డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా , మెదడు వాపు జ్వరాలు బారిన పడకుండా అందరూ ఆరోగ్యంగా ఉండవచ్చునని వారు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెల్త్ సెక్రటరీ లకు,ఆశా కార్యకర్తలు కు పలు సూచనలు చేశారు.