ఎమ్మెల్యే కాలె యాదయ్య-
చేవెళ్లలో ఘనంగా ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయం తి వేడుకలు
చేవెళ్ల : తెలంగాణ చరిత్రలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎప్పటికీ గుర్తిండిపోయే వ్యక్తని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలను మంగళవారం చేవెళ్లలో ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన హాజరై.. జయశంకర్ సార్ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ సేవలను గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ పాత్ర మరువలేనిదని, తెలంగాణ సిద్ధాంతకర్తగా, ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా ఆయన తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన నిరంతర కృషి, ధృడ సంకల్పాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరచిపొరని తెలిపారు. ఉద్యమకారుడి నుండి మహోపాధ్యాయుడి దాకా తెలంగాణకు దిక్సూచిగా నిలిచారని చెప్పారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన జయశంకర్ సేవలు వెలకట్టలేని, ఆయన అందరి హృదయాలలో సిర్థ స్థాయిగా నిలిచిపోయారని, జయశంకర్ ఆశయాల సాధనకు చిత్తశుద్ధితో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన చేసిన సూచనలు, సలహాలు భవిష్యత తరాలకు మార్గదర్శకాలుగా నిలుస్తాయన్నారు. దురదృష్టవశాత్తు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండానే ఆయన మన మధ్య లేకుండా పోవడం బాధకరమన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి వ్యాప్తి చేయడంలో కఠోర శ్రమ చేసిన ప్రొఫెసర్ జయశంకర్ పేరు చరిత్రపుటలో శాశ్వతంగా నిలిచిపోతారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ చైర్మన పడాల వెంకటస్వామి, రాష్ట్ర పొల్యుషన్ బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మధుసూధనరెడ్డి, సున్నపు వసంతం, మాజీ జడ్పీటీసీ మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి, చేవెళ్ల మాజీ సర్పంచ్ బండారి శైలజ ఆగిరెడ్డి, మాజీ ఎంపీటీసీ గుండాల రాములు, పీఎసీఎస్ చైర్మన్లు దేవర సమత వెంకట్‌రెడ్డి, గోనె ప్రతాప్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి, సీనియర్ నాయకులు టేకులపల్లి శ్రీను, జనార్ధనరెడ్డి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి అత్తిల్లి అనంతరెడ్డి, విశ్వకర్మ సంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్ రేణుకాచారి, చేవెళ్ల విశ్వకర్మ సంఘం మండల అధ్యక్షుడు అవుసుల శ్రీనివాస చారి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.శంభు లింగాచారి, ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాస చారి, ఉపాధ్యక్షుడు వి. ఆనంద్ చారి, కోశాధికారి వేణుగోపాల చారి, సీనియర్ జర్నలిస్ట్ వడ్ల శ్రీనివాస చారి, ఆలయ పూజారి రాఘవేందర్ చారి, విశ్వకర్మ సంఘం సీనియర్ నాయకులు లింగాచారి, మోనాచారి, మాణిక్యచారి, యాదగరిచారి, విశ్వకర్మ కమిటీ సభ్యులు శేఖర్ చారి, వీరాచారి, శ్రీశైలం, రాజు, మహేష్, పెంటయ్యచారి, బ్రహ్మచారి, శ్రీధర్ చారి తదితరులు పాల్గొన్నారు.