చేవెళ్ల సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో.. ప్రేమ తరు మొక్కలు నాటు కార్యక్రమం
సత్యసాయి సేవా సమితి తెలంగాణ మహిళా యూత్ కో ఆర్డినేటర్ నాగాజ్యోతి
అఖిల భారత స్థాయిలో ఆగస్టు 4వ తేదీన చేపట్టిన ” ప్రేమ తరు- మొక్కలు నాటు కార్యక్రమం ” లో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. చేవెళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యసాయి సేవా సమితి తెలంగాణ మహిళా యూత్ కో ఆర్డినేటర్ నాగాజ్యోతి గారు పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. రంగారెడ్డిజిల్లా సత్య సాయి సమితి యువత తో పాటుగా భక్తులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు అత్యధిక సంఖ్యలో మొక్కలు నాటి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా ప్రార్థించారు. చెట్లను పెంచడం వలన కలిగే ప్రయోజనాలను ఆమె వివరించారు. పర్యావరణ పరిరక్షణ తో మానవాళికి ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. చేవెళ్ల సత్య సాయి సమితి కన్వీనర్ రామగౌడ్, యూత్ కో ఆర్డినేటర్, విజయకుమార్ సేవాదళ్ కో ఆర్డినేటర్ భాస్కర్, మహిళా యూత్ కో ఆర్డినేటర్… నిర్మల విజయ కుమార్ సత్య సాయి సేవా సమితి మహిళా సభ్యులు శశిరేఖా, ప్రభావతి, స్వరూప, సభ్యులు మధుసూదన్, పెంటారెడ్డి, చేగూరి మానిక్యారెడ్డి, మహేందర్ రెడ్డి, విఠల్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.