నిబంధనలకు విరుద్ధంగా ఒకే కుటుంబానికి ప్రభుత్వ అసైన్డ్ పొలాలు

షాద్ నగర్ ఆర్డీవోకు లిఖితపూర్వక ఫిర్యాదు

టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు

కొండన్నగూడ మట్టి వ్యవహారంతో పాటు అసైన్డ్ పొలాల అక్రమాలపై చర్యకు డిమాండ్

కొండన్నగూడ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆర్డీవో కు ఫిర్యాదు

పేద ప్రజలకు అసైన్డ్ భూములను కేటాయిస్తే వాటిని నిబంధనలకు విరుద్ధంగా ఒకే కుటుంబం పెద్ద ఎత్తున సర్కార్ భూములను దక్కించుకొన్న వ్యవహారంతో పాటు సదరు భూములలో నిబంధనలకు వ్యతిరేకంగా అడ్డగోలుగా మట్టి వ్యాపారం చేస్తూ పైగా పాటు కాలువను పాడుచేసి ధ్వంసం చేసిన వ్యవహారాల్లో చట్టరీత్యా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ప్రభుత్వాన్ని మరోమారు డిమాండ్ చేశారు. శుక్రవారం ఈ మేరకు స్థానిక ఆర్డీవో వెంకట మాధవరావు కు ఆయన లిఖితపూర్వక ఫిర్యాధు చేశారు. ఫరూక్ నగర్ మండలం కొండన్నగూడ గ్రామంలోని సర్వే నంబర్ 53లో దాదాపు 350 మందికి సర్కార్ లావోని పొలాలను ఇచ్చారని ఫిర్యాదులో వివరించారు. ఈ నేపథ్యంలో ఫరూక్ నగర్ మండలం కొండన్నగూడ గ్రామంలో సర్వేనెంబర్ 53/1/రు/1 లో ఉన్న 1ఎకరా 13 గుంటలు అదేవిధంగా సర్వేనెంబర్ 53/1అ/38 లో 3 ఎకరాల 34 గుంటలు మొత్తం ఐదు ఎకరాల ఏడు గంటల భూమి ఉందని, అదేవిధంగా సర్వేనెంబర్ 53/1అ 1లో 26 గుంటలు. సర్వేనెంబర్ 53/ 1ఓలో 1 ఎకరా 14 గుంటలు మొత్తం 2 ఎకరాల భూమిలో ప్రభుత్వ అసైన్డ్ భూమి మేడమోని విట్యాల కృష్ణయ్య, మేడమోని విట్యాల శ్యామల దంపతులకు ప్రభుత్వం అసైన్డ్ ఇచ్చిందని తెలిపారు. ఈ పొలంలో ఉన్న పాటు కాలువను సైతం వారు ధ్వంసం చేసి మట్టిని దర్జాగా విక్రయించారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొండన్నగూడ గ్రామంలో సదరు సర్వే నెంబర్లలో వాటర్ షెడ్ల పనులు చేపట్టినట్టు తెలిపారు. అందుకోసం 20 లక్షల రూపాయలను మంజూరు చేసి వాటర్ షెడ్ అభివృద్ధి కోసం పాటు కాలువలు, ఆనకట్టలు నిర్మించినట్లు గుర్తు చేశారు. ఇక్కడ నీరు కొమ్మోని కుంటకు వెళుతుందని ఈ సందర్భంగా ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ అసైన్డ్ పొలాలలో ఇలా విచ్చలవిడిగా నిబంధనలకు వ్యతిరేకంగా మట్టిని తరలించి సొమ్ము చేసుకున్న వారిపై నీటిపారుదల శాఖ అధికారులు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఒకే కుటుంబానికి చెందిన మేడమోని కృష్ణయ్య అతని భార్య శ్యామల అదేవిధంగా అతని కుటుంబ సభ్యులపై నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ పొలాలు ఎలా ఒక కుటుంబానికే ఎక్కువ భూమి ఎలా ఇచ్చారో అధికారులు చెప్పాలని కోరారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఒకే కుటుంబంలో ప్రతి వ్యక్తికి అసైన్డ్ పొలం ఎలా కేటాయించారు? అధికారులు సమగ్ర దర్యాప్తు జరపాలన్నారు. ఓవైపు ప్రభుత్వ అసైన్డ్ పొలాలను నిబంధనకు వ్యతిరేకంగా ఒకే కుటుంబం అనుభవిస్తూ పదిమందికి ఉపయోగపడే పాటు కాలువలను పాడుచేసి మట్టిని అమ్ముకోన్నారని తెలిపారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బక్కని నర్సింహులు లికిత పూర్వక ఫిర్యాదులు ఆర్డీవోలు కోరినట్టు తెలిపారు..

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!