ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారిని వారి నివాసంలో బీజేపీ మాజీ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి గారు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి గారు, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావు గార్లు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో వివిధ నూతన రైళ్ల గురించి మరియు షాద్ నగర్ కు నూతనంగా MMTS రైలు ప్రారంభించాలని వారితో చర్చించారు. ఈ సందర్బంగా అశ్విని వైష్ణవ్ గారు సానుకూలంగా స్పందించారని శ్రీవర్ధన్ రెడ్డి గారు అన్నారు.