సర్వసిద్ది పి.హెచ్.సి ను ఆకస్మికంగా సందర్శించిన ఇన్చార్జి డి.ఎం & హెచ్. ఓ..డాక్టర్ ఎం.ఎస్.వి. కె.బాలాజీ.
అనకాపల్లి జిల్లా యస్ రాయవరం మండలం సర్వసిద్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మరియు జిల్లా టి.బి, లెప్రసి , ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ ఎం.ఎస్.వి. కె.బాలాజీ ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రి రికార్డులను తనిఖీ చేసి పలు అంశాలపై సూచనలు, సలహాలు ఇచ్చి ప్రస్తుతం జరుగుచున్న *"లెప్రసి కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్", "డెంగ్యూ వ్యతిరేక మాసోత్చవాలు", "స్టాప్ డయేరియా కార్యక్రమం" లు పురస్కరించుకొని క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరు ఏ విధంగా ఉంది రిపోర్టులు సమయానికి పంపిస్తున్నారా లేరా అవగాహన కార్యక్రమాలు ప్రతి సచివాలయం పరిధిలో నిర్వహిస్తున్నారా లేదా అనే విషయాలపై ఆరా తీశారు అదేవిధంగా గర్భిణీ స్త్రీలు నమోదు ,ప్రసవాల నమోదు, చైల్డ్ రిజిస్ట్రేషన్ గురించి అడిగి ఆసుపత్రి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు తదనంతరం మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ ఎస్ ఎస్ వి శక్తి ప్రియ మరియు డాక్టర్ ఎన్ వాసంతి లకు కొన్ని కార్యక్రమాలపై సూచనలు చేశారు. అలాగే పి.హెచ్.సి వద్దకు వచ్చిన లెప్రసి అనుమానిత మచ్చలు వున్న వ్యక్తులను డాక్టర్ ఎం.ఎస్.వి. కె.బాలాజీ గారు పరీక్షించి ఇది లెప్రసి మచ్చలు కావని నిర్ధారించారు తదుపరి చికిత్స ను సూచించారు. ఆరోగ్య విస్తరణ అధికారి టి నాగేశ్వరరావు, హెల్త్ విజిటర్ వై.సూర్యకుమారి లను క్షేత్రస్థాయి లో అవగాహన కార్యక్రమాల్లో చురుగ్గా సిబ్బంది అందరూ పాల్గొనేలా మీరు చూడాలని వారిని ఆదేశించారు. వీరితో పాటు ఇతర ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.