సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టీవీ ప్రతినిధి మెదక్
తేది 26-7-2024.
మెదక్ బస్ స్టాండ్ నీ పరిశుభ్రంగా ఉంచాలి.
ప్రయాణికులకు ఎలాంటి సమస్య లేకుండా చూడాలి.
మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి.
వర్షపు నీరు నిలవకుండా చూడాలి.
బస్టాండ్ లో ఉన్న కిరణా షాపుల్లో సరసమైన ధరలకే వస్తువులను అమ్మాలి
మెదక్ ఆర్డిఓ రమాదేవి
స్థానిక మెదక్ బస్టాండ్ ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు మెదక్ ఆర్.డి.ఓ రమాదేవి,మెదక్ తహసిల్దార్ శ్రీనివాస్ లు డిపో మేనేజర్ సురేఖతో శుక్రవారం బస్టాండ్ ను పరిశీలించారు. మెదక్ ఆర్.డి.ఓ రమాదేవి ప్రయాణికులను బస్టాండ్ లో ఉన్న సౌకర్యాల గురించి అడిగారు. బస్సుల సమయపాలన గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు గల అసౌకర్యాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆర్డీవో రమాదేవి మాట్లాడుతూ బస్టాండ్ ఏరియా అంతా పరిశుభ్రంగా ఉండాలని, మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలన్నారు. బస్టాండ్ ఏరియా లో నీరు నిలవకుండా సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు. బస్టాండ్ ఏరియాలో ఉన్న కిరణా షాప్ లో సరసమైన ధరలకే వస్తువులను అమ్మాలని, ఒకవేళ అధిక ధరకు వస్తువులను అమ్మితే చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.